అమెరికాలో ‘పవర్ ఫుల్’ కలెక్షన్లు

  • April 9, 2016 / 12:14 PM IST

ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం అమెరికాలో మొదటి రోజు పవర్ ఫుల్ కలెక్షన్లు రాబట్టినట్లు బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తన ట్విటర్ అక్కౌంట్ లో పేర్కొన్నారు. ఈ చిత్రం మొదటి రోజు ప్రివ్యూస్ ద్వారా రూ.4.10 కోట్లు వసూలు చేసినట్లు ఆయన తెలిపారు.మరోతెలుగు చిత్రం ‘ఊపిరి’ ఇప్పటి వరకు రూ.9.53 కోట్లు వసూలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. కాగా పవన్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ బాక్సాఫీస్ వద్ద మిక్సిడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్ల వసూళ్లలో మాత్రం దూసుకుపోతుంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పవన్ కాజల్ అగర్వాల్ జంటగా నటించగా, శరద్ కల్కేర్ ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. శరత్ మరార్, సునీల్ లుల్లా లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus