“తలైవార్” టార్గెట్ గా పవర్ స్టార్!!!

సినిమాల్లో పాపులారిటీ కోసం ఏమీ చెయ్యడానికైనా రెడీ అయిపోతారు కొందరు. అయితే ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత సినీరంగం, రాజకీయ రంగాల్లో సెలబ్రెటీస్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వాళ్ళని వాళ్ళు తమకు నచ్చిన విధంగా ప్రమోట్ చేసుకుంటున్నారు.

ఇదిలా ఉంటే ఇక సూపర్ స్టార్ పై పవర్ స్టార్ సంచలన వ్యాఖ్యలు చేశాడు…పవర్ స్టార్ అంటే పవన్ కల్యాణ్ అని అనుకున్నారా…. అలా అనుకుంటే పప్పులో కాలు వేసినట్లే.. పవర్ స్టార్ అంటే మన తెలుగు జనసేన పవన్ కల్యాణ్ కాదు, తమిళంలో కూడా ఒక పవర్ స్టార్ ఉన్నాడు కదా. ఆయన గారు…ఈ పవర్ స్టార్ గారు ఎప్పుడూ ఏదో ఒక సంచలన వాఖ్యలు చేస్తూ తనను తాను పవర్ స్టార్ గా ప్రకటించుకుంటూ ఉండే కమెడియన్. ఇంకా చెప్పాలంటే.. ఇక్కడ మనకి బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ఎలాగో అక్కడ పవర్ స్టార్ శ్రీనివాసన్ అలాగన్నమాట.

అయితే రజని కాంత్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యల్లోకి వెళితే….ఈ పవర్ స్టాట్ రజినీ గురించి మాట్లాడుతూ..ఆయన అంటే ఎంతో గౌరవమని ఆయన సెల్ఫ్ కాన్ఫిడెన్స్.. హార్డ్ వర్క్.. పట్టుదల ఈ స్థాయికి చేర్చాయి. ఆయన కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలున్నాయి. ఎంతో కష్టపడ్డారు. నేను కూడా ఆయన్నే ఫాలో అవుతున్నా. ఆయనొక్కడిని మాత్రమే నా కాంపిటీటర్ గా భావిస్తున్నా అంటున్నాడు ఈ తమిళ పవర్ స్టార్. ఈ విషయం తలైవార్ ఫ్యాన్స్ సరదాగా తీసుకుంటే పర్వాలేదు కానీ, కాస్త సీరియస్ గా తీసుకున్న కష్టమే.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus