ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ద్వారా నిరూపించుకొని సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు అందుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే సామాన్య ప్రజలే కాకుండా సెలబ్రిటీల పిల్లలు కూడా ఇలా సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీలుగా మారటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వీరిలో కొంతమంది తల్లిదండ్రుల గుర్తింపు వల్ల ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంటుంటే మరి కొంతమంది తమ టాలెంట్ వల్ల అవకాశాలు అందుకుంటున్నారు. ఈవిధంగా ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చినా కూడా కొంతమందికి సరైన గుర్తింపు లభించడం లేదు.
అయితే మరి కొంతమంది మాత్రం ఓవర్ నైట్ లో సెలబ్రిటీలు అయిపోతున్నారు. ఇలా ఓవర్ నైట్ లో స్టార్ గా మారిపోయిన వారిలో బుల్లితెర నటుడు ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ కూడా ఒకరు. ఎన్నో ఏళ్లుగా బుల్లితెర మీద సందడి చేస్తూ బుల్లితెర మెగాస్టార్ గా గుర్తింపు పొందిన ప్రభాకర్ గురించి తెలియని వారంటూ ఉండరు. ప్రభాకర్ కి ఇద్దరు పిల్లలు. ప్రభాకర్ కూతురు యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ బాగా ఫేమస్ అయ్యింది. ఇక ప్రభాకర్ భార్య కూడా సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా బాగా పాపులర్ అయింది.
ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ మాత్రం సినిమాలలో హీరోగా రాణించటానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల చంద్రహాస్ హీరోగా ఒక సినిమాని కూడా అనౌన్స్ చేశారు. ఆ సమయంలో జరిగిన ప్రెస్ మీట్ లో చంద్రహాస్ ప్రవర్తించిన తీరుతో ఆటిట్యూడ్ స్టార్ గా ఓవర్ నైట్ లో పాపులర్ అయ్యాడు. చంద్రహాస్ గురించి సోషల్ మీడియాలో కూడా తెగ ట్రోల్ చేశారు. ఇదిలా ఉండగా ఇటీవల బుల్లితెర మీద ప్రసారమైన ఒక టీవీ షోలో పాల్గొన్న చంద్రహాస్ ఈ సంఘటన గురించి స్పందించారు.
ఈ క్రమంలో చంద్రహాస్ మాట్లాడుతూ.. ఆరోజు తాను కావాలని అలా చేయలేదని. అన్ని కెమెరాల ముందు తన తండ్రి తనని పొగుడుతుంటే నవ్వు ఆపుకోలేక అలా ప్రవర్తించాల్సి వచ్చిందని వెల్లడించాడు. అయితే అందరూ దాన్ని తప్పుగా అర్థం చేసుకొని నాకు ఆటిట్యూడ్ ఉందని ట్రోల్ చేశారని చెప్పుకొచ్చాడు. అయితే తాను ఆ ట్రోల్స్ ని చాలా స్ఫూర్తిగా తీసుకున్నానని స్పష్టం చేశాడు.
హంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పఠాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌందర్య టు శృతి హాసన్.. సంక్రాంతికి రెండేసి సినిమాలతో పలకరించిన హీరోయిన్ల లిస్ట్..!
అతి తక్కువ రోజుల్లో వంద కోట్లు కొల్లగొట్టిన 10 తెలుగు సినిమాలు!