ఇండియా వైడ్ టాప్ ట్రెండ్ అవుతున్న ప్రభాస్ 20

స్టార్ హీరో ఫ్యాన్స్ మధ్య నడుస్తున్న కొత్త ట్రెండ్ సోషల్ మీడియా ట్రెండింగ్. స్టార్ హీరోల పుట్టిన రోజు లేదా వారి కొత్త సినిమాల అప్డేట్స్ ట్రెండ్ చేస్తూ…తమ స్టామినా చూపించాలని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. మరి ఈ విషయంలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఫ్యాన్స్ తక్కువ తిన్నారా. రాక రాక వచ్చిన ఓ అప్డేట్ ని సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ చేస్తున్నారు. నేడు ప్రభాస్ 20 ఫస్ట్ లుక్ గురించి ప్రభాస్ అప్డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. జులై 10న ఉదయం 10: 10 నిమిషాలకు ప్రభాస్ 20 ఫస్ట్ లుక్ విడుదల కానుంది.

ఈ విషయం ప్రభాస్ తన ఇంస్టాగ్రామ్ లో పంచుకున్న క్షణాలలో వైరల్ గా మారింది. ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఈ అప్డేట్ ని వీర లెవెల్లో ట్రెండ్ చేస్తూ ఇండియా వైడ్ టాప్ ట్రెండింగ్ లోకి తీసుకెళుతున్నారు. ప్రభాస్ 20 అనే యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ఇండియా వైడ్ గా టాప్ ట్రెండ్స్ లో ఒకటిగా కొనసాగుతుంది. అప్డేట్ తెలిసిన కొద్దిసేపటికే ప్రభాస్ ఫ్యాన్స్ ఆ యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు.

మరి జస్ట్ ఫస్ట్ లుక్ అనౌన్స్మెంట్ కే ఇంత హంగామా చేసిన ప్రభాస్ ఫ్యాన్స్ మరి ఫస్ట్ లుక్ విడుదల రోజు ఏ స్థాయిలో సోషల్ మీడియాలో రచ్చ చేస్తారో చెప్పలేకున్నాం. ఇక దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ పీరియాడిక్ లవ్ డ్రామాపై భారీ అంచనాలున్నాయి. 1960 ల కాలం నాటి యూరప్ నేపథ్యంలో నడిచే ప్రేమ కథగా ఈ చిత్రం ఉండనుంది. 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుండగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. రాధే శ్యామ్ అనే టైటిల్ ప్రచారంలో ఉండగా జులై 10న స్పష్టత రానుంది.

Most Recommended Video

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus