యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి కంక్లూజన్ తర్వాత డైరక్టర్ సుజీత్ దర్శకత్వంలో నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఏక కాలంలో మూడు భాషల్లో వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతోంది. రీసెంట్ గా అబుదాబిలో ప్రభాస్ పై కొన్ని యాక్షన్ సీన్స్ కంప్లీట్ చేశారు. ఈ మూవీ తర్వాత జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇందుకు కూడా ప్రీ ప్రొడక్షన్ వర్క్ వేగంగా జరుగుతోంది. ఆగస్టు నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రం గురించి ఆసక్తికర సంగతులు బయటికి వచ్చాయి. ఇది ఒక ఫాంటసీ కథని తెలిసింది. ఈ చిత్రం ఎక్కువగా యూరప్ లోనే చిత్రీకరణ జరుగుతుందని సమాచారం. అదికూడా 1970 నాటి కాలంలో కథ సాగుతుందని ఫిలిం నగర్ వాసులు చెప్పారు.
అందుకోసం ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్ అప్పటి కాలానికి సంబంధించిన సెట్స్, లొకేషన్స్ సెట్ జేసే పనిలో నిమగ్నమయి ఉన్నారు. ఇందులో ప్రభాస్ సరసన డీజే బ్యూటీ, జిగేల్ రాణి పూజా హెగ్డే హీరోయిన్ గా ఫిక్స్ అయింది. ఈ సినిమాకు బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది మ్యూజిక్ అందించనున్నట్లు సమాచారం. ఈయన గతంలో ‘దేవ్ డి, ఇష్క్ జ్యాదా, క్వీన్, హైవే, లూటేరా’ వంటి సినిమాలకు సంగీతం ఇచ్చారు. ప్రభాస్ 20 వ సినిమా ద్వారా టాలీవుడ్ లోకి అడుగుపెట్టబోతున్నారు. యువీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ లు నిర్మించనున్న ఈ సినిమా గురించి అధికారికంగా త్వరలో వెల్లడించనున్నారు.