Prabhas: ప్రభాస్ మాస్టర్ ప్లాన్ అదుర్స్ అంటున్న ఫ్యాన్స్!

స్టార్ హీరో ప్రభాస్ నటించిన సాహో సినిమా 2019 సంవత్సరం ఆగష్టు నెలలో రిలీజైంది. ప్రభాస్ తర్వాత సినిమా కోసం ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ వచ్చే ఏడాది తను నటించిన మూడు సినిమాలను విడుదల చేయాలని భావిస్తున్నారు. అయితే ప్రభాస్ అనుకున్నది ఖచ్చితంగా చేస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్, ఆదిపురుష్ షూటింగ్ లు ఇప్పటికే పూర్తయ్యాయి. 2022 సంవత్సరం ప్రభాస్ నామ సంవత్సరం అవుతుందని ప్రభాస్ నటించిన మూడు సినిమాలు సక్సెస్ సాధిస్తాయని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.

ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమా షూటింగ్ కూడా వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ నాటికి పూర్తి కానుందని తెలుస్తోంది. సలార్ సినిమాలో కళ్లు చెదిరే ఎలివేషన్ సీన్లు ఉండే విధంగా ప్రశాంత్ నీల్ ప్లాన్ చేశారని సమాచారం. ప్రభాస్ వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఫ్యాన్స్ ను సంతోషపరుస్తున్నారు. ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కె సినిమా షూటింగ్ కూడా వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తయ్యే ఛాన్స్ ఉంది. ఈ సినిమా కోసం ప్రభాస్ ఏకంగా 200 రోజుల కాల్షీట్లు కేటాయించారని సమాచారం.

పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కించే సత్తా ఉన్న డైరెక్టర్లకు మాత్రమే ప్రభాస్ సినిమా ఆఫర్లను ఇస్తున్నారు. స్టార్ హీరో ప్రభాస్ సంవత్సరానికి కనీసం రెండు సినిమాలు రిలీజయ్యే విధంగా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటూ ప్రభాస్ అదుర్స్ అనిపించుకుంటున్నారు. ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్నీ 300 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus