Prabhas: వరుస రికార్డ్స్ తో సత్తా చాటుతున్న ప్రభాస్.. ఎవరికీ సాధ్యం కాదుగా!
- August 23, 2024 / 09:17 PM ISTByFilmy Focus
టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ కు (Prabhas) రికార్డులు కొత్త కాదు. ప్రభాస్ ఖాతాలో ఎన్నో సంచలన రికార్డ్స్ ఉన్నాయనే సంగతి తెలిసిందే. రాబోయే రోజుల్లో ప్రభాస్ మరిన్ని రికార్డులను క్రియేట్ చేయడం పక్కా అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్మాక్స్ సర్వే ఫలితాలలో ప్రభాస్ ఈ నెలలో కూడా నంబర్ వన్ స్థానంలో నిలిచారు. వరుసగా మూడు నెలల పాటు ప్రభాస్ నంబర్ వన్ స్థానంలో నిలవడం కొసమెరుపు.
Prabhas

ప్రభాస్ కల్కి (Kalki 2898 AD) ఓటీటీలో సంచలన రికార్డులను సొంతం చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్న తరుణంలో ఆర్మాక్స్ మోస్ట్ పాపులర్ హీరోల జాబితాలో ప్రభాస్ మరోమారు టాప్ లో నిలిచి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. దేశవ్యాప్తంగా ప్రభాస్ నంబర్ వన్ అని ప్రభాస్ కు దేశంలోనే పోటీ లేదని అభిమానులు చెబుతున్నారు. పాపులర్ హీరోల లిస్ట్ లో ప్రభాస్ కు తొలి స్థానం దక్కడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) ఈ లిస్ట్ లో రెండో స్థానంలో నిలిచారు. బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ కు (Shah Rukh Khan) ఈ జాబితాలో మూడో స్థానం దక్కగా మహేష్ బాబుకు ఈ జాబితాలో నాలుగో స్థానం దక్కింది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఐదో స్థానంలో నిలవగా అక్షయ్ కుమార్ (Akshay Kumar) ఈ లిస్ట్ లో ఆరో స్థానంలో నిలిచారు. బన్నీ (Allu Arjun) ఏడో స్థానంలో నిలవగా సల్మాన్ ఖాన్ కు (Salman Khan) ఎనిమిదో స్థానం దక్కింది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఈ జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలవగా కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ (Ajith) ఈ జాబితాలో పదో స్థానంలో నిలవడం గమనార్హం. ఈ జాబితాలో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఐదుగురు హీరోలకు ఛాన్స్ దక్కింది. టాలీవుడ్ స్టార్ హీరోలు రాబోయే రోజుల్లో మరిన్ని అరుదైన ఘనతలను సొంతం చేసుకోవాలని అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.














