వైరల్ అవుతున్న ప్రభాస్, అనుష్క ఎయిర్ పోర్ట్ పిక్స్.!

Royal Albert Hallఓ పక్క ‘నిశ్శబ్దం’ అనే చిత్రం చేస్తూ అనుష్క చాలా బిజీగా గడుపుతుంది. హేమంత్ మధుకర్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మాధవన్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ మధ్యే ఈ చిత్రానికి సంబందించిన పోస్టర్స్ విడుదల చేయగా వాటికి అద్భుతమైన స్పందన లభించిన సంగతి తెలిసిందే. ఇక ఈఏడాది ‘సాహో’ థియేటర్లలో సందడి చేసిన ప్రభాస్ త్వరలోనే రాధా కృష్ణకుమార్ డైరెక్షన్లో ఓ చిత్రం చేయడానికి రెడీ అవుతున్నాడు.

ఇక వీరిద్దరూ తాజాగా ఎయిర్ పోర్ట్ లో దర్శనమిచ్చారు. లండన్ లోని ‘రాయల్ ఆల్బర్ట్ హాల్’ లో ‘బాహుబలి’ స్క్రీనింగ్ కోసం వీరిద్దరూ ప్రయాణమై వెళ్తుండగా ఈ ఫోటోలు తీసినట్టు తెలిస్తుంది. ‘బ్లాక్ ఔట్ ఫిట్స్’ లో వీరిద్దరూ యమ స్టైలిష్ గా ఉన్నారు. మొన్నటికి మొన్న కాస్త లావైనట్టు కనిపించిన అనుష్క ఈ ఫొటోల్లో సన్నగా కనిపిస్తుంది. ఇటీవల ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో ఝాన్సీ లక్ష్మీ బాయ్ గా కనిపించి అలరించింది అనుష్క. ఇక వీరిద్దరి ఎయిర్ పోర్ట్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

బాలీవుడ్ లో మంచి కలెక్షన్లు రాబట్టిన సౌత్ సినిమాలు..?
చిరంజీవి అతిధి పాత్ర చేసిన సినిమాలు?

1

2

3

4

5

6

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus