‘ప్రభాస్ బాహుబలి’ విడుదలవుతోంది!

  • July 12, 2016 / 09:49 AM IST

బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు ప్రభాస్. దీంతో ఆయనకున్న క్రేజ్ ను వాడుకోవాలని దర్శకనిర్మాతలు ఫిక్స్ అయిపోయారు. ముఖ్యంగా కోలీవుడ్ లో ఉన్న నిర్మాతలు ప్రభాస్ తెలుగులో నటించిన ప్రతి సినిమాను డబ్ చేసి తమిళంలో రిలీజ్ చేస్తున్నారు. తమిళ ప్రేక్షకులను కూడా ప్రభాస్ సినిమాల పట్ల ఆసక్తి చూపడంతో ఇప్పటివరకు ఆయన నటించిన చాలా చిత్రాలను అనువాదాలుగా విడుదల చేసేసారు. తాజాగా ‘డార్లింగ్’ సినిమాను కూడా డబ్ చేస్తున్నారు.

ప్రభాస్, కాజల్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని ఈ నెల 15 న తమిళంలో విడుదల చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు టైటిల్ గా ‘ప్రభాస్ బాహుబలి’ అని కన్ఫర్మ్ చేశారట. కథ, కథనాలకు సంబంధం లేకపోయినా.. బాహుబలి సినిమాకు, ప్రభాస్ కు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని ఈ టైటిల్ పెట్టినట్లు తెలుస్తోంది. వినేవారికి ఎలా ఉన్నా.. ఈ టైటిల్ తో వసూళ్ల వర్షం కురవడం ఖాయమని భావిస్తున్నారు. తెలుగులో అయితే ఈ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. మరియు తమిళ ప్రేక్షకులు ఈ ‘ప్రభాస్ బాహుబలి’ ని ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus