Mahesh Babu: ఆ స్టార్ డైరెక్టర్ డైరెక్షన్ లో మహేష్ నటించనున్నారా?

  • June 28, 2022 / 04:27 PM IST

మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబో మూవీ అంతకంతకూ ఆలస్యమవుతున్న నేపథ్యంలో మహేష్ బాబు అభిమానులు ఒకింత అసంతృప్తితో ఉన్నారు. త్వరగా ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన అప్ డేట్ ఇస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే మహేష్ త్రివిక్రమ్ సినిమాను పూర్తి చేసి ఆ తర్వాత రాజమౌళి సినిమాపై దృష్టి పెట్టనున్నారు. రాజమౌళి సినిమా కోసం రెండేళ్ల సమయం కేటాయించడానికి సిద్ధమేనని మహేష్ బాబు ఇప్పటికే ప్రకటించారు. అయితే మహేష్ బాబు 30వ సినిమా గురించి అభిమానుల మధ్య జోరుగా చర్చ జరుగుతోంది.

ఈ సినిమాకు కొన్నిరోజుల క్రితం వరకు సుకుమార్ డైరెక్టర్ గా వ్యవహరించే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగా పేరు కూడా వినిపిస్తోంది. ఈ ఇద్దరు డైరెక్టర్లలో ఎవరో ఒకరు మహేష్ 30వ సినిమాకు దర్శకుడిగా ఫిక్స్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ సినిమా పూర్తైన తర్వాత మహేష్ సందీప్ కాంబోలో సినిమా వస్తుందేమో చూడాల్సి ఉంది.

మహేష్ బాబు స్పందిస్తే మాత్రమే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి మరింత క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. మహేష్ కొత్త ప్రాజెక్ట్ ల గురించి స్పష్టత ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరోవైపు సినిమాసినిమాకు మహేష్ బాబు మార్కెట్ పెరుగుతోంది. మహేష్ బాబుకు ఇత్ర రాష్ట్రాల ప్రేక్షకుల్లో కూడా క్రేజ్ పెరుగుతోంది.

మహేష్ తర్వాత ప్రాజెక్ట్ లతో బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మహేష్ రెమ్యునరేషన్ సైతం చాలామంది స్టార్స్ తో పోలిస్తే ఎక్కువగా ఉంది. మహేష్ ఈ ఏడాది సర్కారు వారి పాట సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus