‘ఓం కమ్ టు మై రూమ్…’ ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్లు, చూసినట్లు ఉంది కదా! ‘ఆదిపురుష్’ సినిమా టీజర్ రిలీజ్ తర్వాత అక్కడి వీడియో ఫుటేజ్‌లో ప్రభాస్ నోట వినిపించిన మాట ఇది. దర్శకుడు ఓం రౌత్‌ను ఒకసారి రూమ్‌కి వచ్చి కలవమని ప్రభాస్ చెప్పాడు అనేది ఆ డైలాగ్ వివరణ. అయితే ఆ సినిమా టీజర్ దారుణంగా ఉండేసరికి ఓం రౌత్‌కు బాగా క్లాస్ పడింది అని సోషల్ మీడియాలో మీమ్స్ నిండిపోయాయి. అయితే సినిమాలో చాలా మార్పులు చేశామని, అంతా ఓకే అని రిలీజ్ చేశారు. ఫలితం గురించి అందరికీ తెలిసిందే.
నిజానికి టీజర్ చూశాక కాదు.. సినిమా షూటింగ్ తొలి వారంలోనే ప్రభాస్ ఈ డౌట్ పడ్డాడట. సినిమా ఫలితం మాట అటుంచితే.. వివాదాలు ఎక్కువైపోయాయి. కథ, కథనం, డైలాగ్స్, పాత్రల చిత్రణ, విషయం… ఇలా అన్నీ తేడాగానే ఉన్నాయి. దీంతో ఆదిపురుష్ కాస్త వివాద పురుష్ అయిపోయాడు. ఈ క్రమంలో ఓ ఆసక్తికర వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అందులో ‘ఆదిపురుష్’ సినిమా షూట్ మొదలైన తొలి రోజుల్లో ప్రభాస్ రెస్పాన్స్ గురించి ఉంది. ఆ మాటలు చెప్పింది కూడా ప్రభాసే.
‘రాధేశ్యామ్’ ప్రమోషన్స్‌లో భాగంగా (Prabhas) ప్రభాస్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిట్ వీడియో అది. ‘ఆదిపురుష్’ సినిమా షూటింగ్ నాలుగు రోజులు పూర్తయిన తర్వాత తాను పోషిస్తున్న రాఘవుడి పాత్రపై అనుమానం వ్యక్తం చేశాడట ప్రభాస్. ‘నేను ఈ సినిమా చేయొచ్చా?’ అని ఓం రౌత్‌ను ప్రభాస్ అడిగారట. అంతకుముందు అలాంటి సినిమా/పాత్ర చేయలేదని, ఇతర సినిమాల విషయంలో తప్పు జరిగినా పర్వాలేదు, ‘ఆదిపురుష్’ లాంటి సినిమాలో విషయంలో తప్పు జరగకూడదు అని చెప్పారట.
అయితే దానికి ఓం రౌత్ స్పందిస్తూ… ‘ఎలాంటి భయాలు పెట్టుకోవద్దు. నేనున్నా కదా’ అని అన్నారట. ఈ వీడియో చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పుడు ఓం రౌత్ మీద విరుచుకుపడుతున్నారు. హీరో ముందే హెచ్చరించినా, సరి చూసుకోకుండా ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ‘ఆదిపురుష్’ సినిమా తీశారని విమర్శిస్తున్నారు. సినిమా ఫలితమే కాదు.. ప్రభాస్ లుక్, అప్పీయరెన్స్ విషయంలోనూ విమర్శలు వచ్చాయనే విషయం మరచిపోకూడదు.
ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్