‘కాలకేయ’పై కోపంగా ప్రభాస్ ఫ్యాన్స్!!!

టాలీవుడ్ టాప్ యంగ్ హీరోల్లో ఒకరైన ప్రభాస్ క్రేజ్ బాహుబలితో ఎక్కడికో వెళ్ళిపోయినా సంగతి తెలిసిందే. బేసిక్ గానే టాప్ హీరో అయిన ప్రభాస్ మార్కెట్ విపరీతంగా పెరిగిపోవడంతో ప్రభాస్ పేరు పెట్టుకుని మరీ సినిమాలు తీసేస్తున్నారు. వివరాల్లోకి వెళితే…తాజాగా ప్రభాస్ బాహుబలిలో కాలకేయ పాత్రలో నటించిన ప్రభాకర్ గుర్తున్నాడా? ఈ సినిమాకు ముందు వరకూ ప్రభాకర్ సినిమా లైఫ్ సో..సో..గా సాగిపోయింది. కానీ ఇప్పుడు బాహుబలి పుణ్యమా అని, ఆయన అనుకరించిన బాష పుణ్యమా అని ఆ నటుడి స్థానం ఎక్కడికో వెళ్లిపోయింది.

ఇదిలా ఉంటే తాజాగా ప్రభాకర్ ఒక సినిమా చేస్తూ, ఆ సినిమా పుణ్యమా అంటూ ప్రభాస్ అభిమానులకు టార్గెట్ అయిపోయాడు. ఇంతకీ విషయం ఏమిటంటే…ప్రభాకర్ కీలక పాత్ర పోషిస్తూ నూతన నటీనటులతో నిర్మించిన ‘ఆవు-పులి-మధ్యలో ప్రభాస్ పెళ్ళి’ సినిమాకు సంబంధించిన టీజర్ ప్రభాస్ అభిమానులకు విపరీతమైన కోపం తెప్పిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో హీరో పాత్ర పేరు ప్రభాస్ కావడం, అదే క్రమంలో ఈ సినిమాలో డైలాగ్స్ కొన్ని డైరెక్ట్ గా ప్రభాస్ ను టార్గెట్ చేసి రాసినట్లుగా ఉండడంతో ఈ విషయంపై యంగ్ రెబెల్ స్టార్ ఫ్యాన్స్ గుర్రు మంటున్నారు….ఈ సినిమాలో హీరోనూ ఉద్దేశించి కొన్ని డైలాగ్స్ ఉన్నాయి అని ఏమిటంటే..‘చూడు ప్రభాస్ మళ్ళీ నాకెప్పుడు కనిపించకు చంపేస్తా’ అంటూ ఆ హీరోని ఉద్దేశించి ఒక డైలాగ్ చెబుతాడు.

అంతేకాకుండా హీరో పాత్రను పోషిస్తున్న నూతన నటుడు ప్రభాస్ ‘బాహుబలి’ వార్ సీన్ లో చెప్పిన డైలాగ్ ను అనుసరిస్తూ ‘నాతో వచ్చేది ఎవరూ..చచ్చేది ఎవరూ’ అంటూ ప్రభాస్ ను అనుకరిస్తూ చెప్పాడు…ఇక ఈ డైలాగ్స్ చూసిన ప్రభాస్ అభిమానులు సినిమాను టార్గెట్ చేస్తూ ఆన్‌లైన్ లో హల్‌చల్ చేస్తున్నారు. మరి ఈ వ్యవహారం ఎంతవరకూ వెలుతుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus