పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు.. ప్రభాస్ ఫ్యాన్స్ కు పెద్ద తేడా లేదు..!

‘పవన్ కళ్యాణ్ ను.. ప్రభాస్ ఫాలో అవ్వడమేమిటి.. కొంపతీసి ప్రభాస్ కూడా రాజకేయాల్లోకి వచేస్తున్నాడా.. ఏంటి?’ అని కంగారు పడకండి. ఇది పూర్తిగా సినిమాలకు సంబందించిన విషయమే. ప్రభాస్ 2010 కి ముందు వరకూ ఏడాదికి దాదాపు రెండేసి సినిమాలు చేస్తూ వచ్చేవాడు. కానీ 2010 నుండీ హిట్ ట్రాక్ ఎక్కిన తర్వాత ఏడాదికి ఒకటి.. ఇప్పుడైతే రెండేసి సంవత్సరకి ఒక్క సినిమా చేస్తున్నాడు. 2010 లో ‘డార్లింగ్’ విడుదలయ్యి హిట్ అయ్యింది. 2011 లో ‘మిస్టర్ పర్ఫెక్ట్’ తో మరో హిట్ అందుకున్నాడు. 2012 లో ‘రెబల్’ వచ్చి నిరాశపరిచినా.. 2013 లో ‘మిర్చి’ తో ఆ లోటు ని తీర్చేసి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు.

ఇక 2015 లో ‘బాహుబలి’, 2017 లో ‘బాహుబలి2’, 2019 లో ‘సాహో’. ఇలా రెండేసి సంవత్సరాలకి ఓ సినిమా చేస్తూ వస్తున్నాడు. ఇప్పుడు ప్రభాస్ తన 20 వ సినిమా ‘జాన్’ (వర్కింగ్ టైటిల్) సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటీకే 25 శాతం కంప్లీట్ అయ్యింది. కానీ తదుపరి షెడ్యూల్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. 2020 లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు అని అంతా అనుకున్నారు.. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదనేది తాజా సమాచారం. ఇది కూడా 150 కోట్ల బడ్జెట్ సినిమా కాబట్టి ఇంకో సంవత్సరం టైం పడుతుందని తెలుస్తుంది. అంటే 2020 డిసెంబర్ వారం వరకూ ఈ సినిమా షూటింగ్ జరుగుతూనే ఉండే అవకాశం ఉంటుంది. గతంలో పవన్ కళ్యాణ్ కూడా ఇలాగే… ఆలస్యంగా సినిమాలు చేసేవాడు. అయితే ఆయన సినిమా ఫాస్ట్ గా చేసేవాడు కానీ.. కథ సెలెక్ట్ చేసుకోవడం.. తరువాత ప్రీ ప్రొడక్షన్ పనుల విషయంలో ఎక్కువ టైం తీసుకునే వాడు. ఇప్పుడు ప్రభాస్ కూడా పవన్ లాగే ప్రవర్తిస్తున్నాడు అనేది ఇండస్ట్రీలో టాక్.

24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ అండ్ లైక్స్ సాధించిన లిరికల్ సాంగ్స్ ఇవే!
30 సౌత్ ఇండియన్ హీరోయిన్లు మరియు వారి చైల్డ్ హుడ్ పిక్స్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus