Prabhas: ప్రభాస్ మంచితనానికి ఎవరూ సాటిరారుగా.. ఏమైందంటే?

మరికొన్ని గంటల్లో ఆదిపురుష్ మూవీ థియేటర్లలో విడుదల కానుంది. ప్రభాస్ నటించిన కమర్షియల్ సినిమాలపై అభిమానులు ఏ స్థాయిలో ఆసక్తి చూపారో ఈ సినిమాపై కూడా ఫ్యాన్స్ అదే స్థాయిలో ఆసక్తి చూపుతున్నారు. ఆదిపురుష్ మూవీ త్రీడీ టికెట్లకు ఏ స్థాయిలో డిమాండ్ నెలకొందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బుక్ మై షోలో ఆదిపురుష్ మూవీ ఖాతాలో అరుదైన ఘనత చేరడం గమనార్హం.

బుక్ మై షోలో 1 మిలియన్ లైక్స్ ను సొంతం చేసుకున్న ఆదిపురుష్ త్రీడీ వెర్షన్ కు ఫస్ట్ డే టికెట్లు దొరకడం కష్టమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాతో ప్రభాస్ సక్సెస్ సాధిస్తే మాత్రం సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలతో ప్రభాస్ ఖాతాలో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లు చేరతాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రభాస్ తాజాగా చేసిన ఒక పనికి సంబంధించి నెటిజన్ల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

ప్రభాస్ మనస్సు మంచి మనస్సు అనే సంగతి తెలిసిందే. ఇతరులకు సహాయం చేసే విషయంలో ప్రభాస్ ముందువరసలో ఉంటారు. అదే సమయంలో తను చేసిన సహాయాలను కనీసం సోషల్ మీడియా ద్వారా చెప్పుకోవడానికి కూడా ప్రభాస్ ఇష్టపడరు. ప్రభాస్ తాజాగా సలార్ సినిమా కోసం పని చేసిన వాళ్లకు 10,000 రూపాయల చొప్పున సహాయం చేశారని తెలుస్తోంది.

సలార్ సినిమా కోసం పని చేసిన సిబ్బందికి ప్రభాస్ ఈ స్థాయిలో సహాయం చేసినట్టు సమాచారం అందుతోంది. సెప్టెంబర్ నెల 28వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. సలార్ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకుడు కావడంతో యాక్షన్ లవర్స్ ఈ సినిమాపై ప్రత్యేక దృష్టి పెట్టారు. త్వరలో సలార్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుకానున్నాయని సమాచారం అందుతోంది. సలార్ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus