నిర్మాత ఋణం తీర్చుకుంటున్న ప్రభాస్!

  • November 13, 2017 / 11:31 AM IST

సాయం చేయడమే కానీ చెప్పుకోవడం తెలియని హీరో ప్రభాస్. ప్రస్తుతం సాహో షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న యంగ్ రెబల్ స్టార్ తన నిర్మాత ఋణం తీర్చుకున్నట్టు తెలిసింది. వివరాల్లోకి వెళితే..  ప్రభాస్ ‘ఈశ్వర్’ సినిమా ద్వారా పరిచయమయ్యారు. ఆ తర్వాత రాఘవేంద్ర చేశారు. ఇవి మంచి బ్రేక్ ఇవ్వలేకపోయాయి. అప్పుడు ఎం ఎస్ రాజు .. ప్రభాస్ లోని ట్యాలెంట్ ని గుర్తించి వర్షం సినిమాని అతనితో తీశారు. ఇది సూపర్ హిట్ అయి ప్రభాస్ కెరీర్ ని మలుపుతిప్పింది. తనను నమ్మిన నిర్మాతను ప్రభాస్ మరిచిపోలేదు.  ఎం ఎస్ రాజు కొడుకు  సుమంత్ అశ్విన్ మంచి బ్రేక్ కోసం చూస్తున్నారు.

అతని బ్రేక్ ఇవ్వడానికి ప్రభాస్ సాయం చేశారు. తన మిత్రుల బ్యానర్లో ఓ సినిమాని ఇప్పించారు. “హ్యాపీ వెడ్డింగ్” సినిమాలో  సుమంత్ అశ్విన్ కి హీరోగా ఛాన్స్ ఇప్పించారు. యువీ క్రియేషన్స్  బ్యానర్లో వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తున్న ఈ చిత్రం సుమంత్ కెరీర్ ని మలుపుతిప్పుతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ విధంగా ప్రభాస్ తన నిర్మాత ఋణం తీర్చుకున్నారని చెబుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus