Prabhas: ప్రభాస్ హీరోయిన్.. ఏడాది వరకు మరో సినిమా ఒప్పుకోదట!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)  త్వరలోనే ఫౌజీ షూటింగ్ లో చేరబోతున్నాడు. హను రాఘవపూడి (Hanu Raghavapudi)  దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కొత్త హీరోయిన్ ఇమాన్వి ఇస్మాయిల్‌ తెలుగు తెరకు పరిచయం అవుతోంది. స్టార్ హీరో సరసన అవకాశాన్ని అందుకోవడం ఆమె చాలా లక్కీ అనే చెప్పాలి. అయితే ఈ ప్రాజెక్ట్ ప్రారంభం నుంచే ఇమాన్వి పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇమాన్వి ఎంపికకు సంబంధించిన ప్రక్రియలో నిర్మాతలు అత్యంత జాగ్రత్తలు తీసుకున్నారు.

Prabhas

స్క్రీన్ టెస్టులు, పాత్రకు సరిపోతున్న పర్సనాలిటీ, అభినయానికి ప్రాధాన్యత ఇచ్చి ఆమెను తీసుకున్నారు. ప్రస్తుతం తమిళనాడులో కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తయింది. అయితే ప్రభాస్ బిజీ షెడ్యూల్ కారణంగా షూటింగ్ తాత్కాలికంగా విరామంలో ఉంది. ఇక మరోవైపు ఇమాన్వి కోసం ప్రత్యేక కాల్ షీట్స్ కేటాయించి, ఏడాది పాటు మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా అగ్రిమెంట్ పెట్టినట్లు సమాచారం.

ఎందుకంటే ప్రభాస్ బిజీ లైనప్ కారణంగా ఆయన ఎప్పుడు షూటింగ్ లో ఉంటారో తెలియని పరిస్థితి. అందుకే హీరోయిన్ ఎప్పుడైనా సరే సిద్ధంగా ఉండాలి అని ఆమెను ఏడాది పాటు ఈ సినిమా కోసమే వర్క్ చేసేలా ప్రిపేర్ చేశారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఇమాన్వికి అనేక సౌకర్యాలు కల్పిస్తున్నారని టాక్. 5-స్టార్ హోటల్ విడిది, బిజినెస్ క్లాస్ ప్రయాణం వంటి సదుపాయాలను అందిస్తున్నారు. ఇమాన్వి అమెరికాలో నివసిస్తున్నప్పటికీ, ఫౌజీ షూటింగ్ షెడ్యూల్స్ కోసం ఎప్పుడైనా ఆమెను వెంటనే రప్పించే ఏర్పాట్లు చేశారు.

ఇలాంటి కండిషన్స్ కారణంగా ఆమెకు వచ్చిన పలు పాన్ ఇండియా ఆఫర్స్‌ను నో చెప్పాల్సి వస్తోందట. ఇమాన్వికి ఇప్పటికే బాలీవుడ్ మరియు దక్షిణాది చిత్రాల నుంచి మంచి ఆఫర్లు వచ్చినా, ప్రస్తుతానికి ఫౌజీ ప్రాజెక్ట్‌కే ఫోకస్ చేస్తోంది. ఇమాన్వి నటనకు హను రాఘవపూడి విశేషంగా ఆకర్షితులయ్యారని, ఈ ప్రాజెక్ట్ ఆమెకు మంచి ప్లాట్ఫామ్ అందిస్తుందని భావిస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus