Subbaraju: 47 ఏళ్ళ వయసులో సైలెంట్ గా పెళ్లి చేసుకున్న సుబ్బరాజు!

పెళ్ళిళ్ళ సీజన్ ఇలా మొదలైందో లేదో వరుసగా టాలీవుడ్ సెలబ్రిటీలు పెళ్లిళ్లు లేదంటే ఎంగేజ్మెంట్లు చేసుకుంటూ షాకిస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు క్రిష్ సైలెంట్ గా రెండో మ్యారేజ్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత సింగర్ అనురాగ్ కులకర్ణి తోటి సింగర్ అయినటువంటి రమ్య బెహరాని పెళ్లి చేసుకున్నాడు. అలాగే అక్కినేని హీరో అఖిల్ (Akhil) ఎంగేజ్మెంట్ చేసుకుని ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇక అతని అన్న అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) కూడా హీరోయిన్ శోభిత ధూళిపాళ (Sobhita) తో పెళ్ళికి రెడీ అవుతున్నాడు.

Subbaraju

డిసెంబర్ 4న వీరి వివాహం జరగబోతుంది. ఇంకా కొంతమంది టాలీవుడ్ సెలబ్రిటీలు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. తాజాగా నటుడు పెనుమ‌త్స‌ సుబ్బ‌రాజు (Subbaraju) కూడా చాలా సైలెంట్ గా పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చాడు. స్వయంగా సుబ్బరాజు తన సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు.

పెళ్లి అనంతరం త‌న భార్య‌తో క‌లిసి బీచ్‌లో దిగిన ఓ ఫొటోను షేర్ చేసి సుబ్బరాజు (Subbaraju) ఈ విషయాన్ని తెలిపారు. అయితే సుబ్బరాజు (Subbaraju) వివాహం చేసుకున్న అమ్మాయి గురించి వివరాలు బయటకు రాలేదు. అసలు పెళ్లి పై ఇంట్రెస్ట్ లేదు అని పలు ఇంటర్వ్యూల్లో చెప్పిన సుబ్బరాజు (Subbaraju) ఫైనల్ గా 47 ఏళ్ల వయసులో సుబ్బరాజు పెళ్లి చేసుకోవడం విశేషంగానే చెప్పుకోవాలి.

ఇప్పటివరకు 50కి పైగా తెలుగు సినిమాల్లో నటించిన సుబ్బరాజు (Subbaraju)… త‌మిళ‌, హిందీ, మ‌ల‌యాళం చిత్రాల్లో కూడా విలక్షణమైన పాత్రలు చేశారు. భీమ‌వ‌రానికి చెందిన సుబ్బ‌రాజు (Subbaraju) ‘ఖ‌డ్గం’ ‘ఆర్య‌’ ‘అమ్మ నాన్న ఓ త‌మిళ అమ్మాయి’ ‘పోకిరి’ ‘దేశముదురు’ ‘లీడ‌ర్‌’ ‘బాహుబ‌లి 2’ ‘బిజినెస్ మ్యాన్‌’ ‘అఖండ’ ‘వాల్తేరు వీర‌య్య’ వంటి సినిమాల్లో నటించారు.

అఖిల్ నిశ్చితార్థం చేసుకున్న బైనవ్ ర‌వ్ డ్జీ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus