Akhil Engagement Photos: సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న అఖిల్?

పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. ఈ కార్తీక మాసంలో చాలా మంది పెళ్లి పీటలెక్కతున్న సంగతి తెలిసిందే. సినీ పరిశ్రమకు చెందిన వారు కూడా ఒక్కొక్కరుగా పెళ్లిపీటలెక్కుతున్నారు. దర్శకుడు క్రిష్ ఈ మధ్యనే రెండో పెళ్లి చేసుకున్నాడు. అలాగే సింగర్ అనురాగ్ కులకర్ణి కూడా రమ్య బెహరాని వివాహం చేసుకోవడం జరిగింది. ఇక అక్కినేని ఫ్యామిలీకి చెందిన నాగ చైతన్య- శోభిత ధూళిపాళ వివాహానికి కూడా రంగం సిద్ధమైంది. డిసెంబర్ 4 న వీరి వివాహం జరగబోతుంది.

Akhil

మరోవైపు ఇదే ఫ్యామిలీలో త్వరలో ఇంకో పెళ్లి వేడుక జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. విషయం ఏంటంటే.. అక్కినేని అఖిల్ (Akhil Akkineni) పెద్ద షాకిచ్చాడు. ఎవ్వరూ ఊహించని విధంగా ఓ నటితో ఎంగేజ్మెంట్ చేసుకుని ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వదిలాడు. అవును.. అక్కినేని నాగార్జున ఈ విషయాన్ని వెల్లడించాడు. జైనాబ్ రవ్డ్జి అనే అమ్మాయిని అఖిల్(Akhil Akkineni) ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. నాగార్జున ఈ విషయం పై తన ట్వీట్ ద్వారా స్పందిస్తూ.. ‘మా అబ్బాయ్ అఖిల్ ఎంగేజ్మెంట్ జైనాబ్ రవ్డ్జి అనే అమ్మాయితో జరిగింది.

ఈ విషయాన్ని ఆనందంతో మాత్రమే కాదు.. థ్రిల్ అవుతూ చెబుతున్నాం. ఈ కొత్త జంటకి మీ అందరి ప్రేమాభిమానాలు, ఆశీర్వాదాలు, కావాలి’ అంటూ రాసుకొచ్చాడు. అఖిల్ అభిమానులు కూడా ఈ ఫోటోలు చూసి తమ బెస్ట్ విషెస్ ను తెలియజేస్తున్నారు. అయితే అఖిల్ వివాహం చేసుకునే జైనాబ్ రవ్డ్జి ఎవరు అనే విషయాలు తెలియాల్సి ఉంది.

1

2

3

మరి చైతు ఇచ్చిన గిఫ్ట్‌ల సంగతేంటి సామ్‌? ఎందుకు పదే పదే అదే ట్రిక్‌!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus