లైకులు అందుకుంటున్న ప్రభాస్ న్యూ లుక్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సుజీత్ దర్శకత్వంలో సాహో మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఏక కాలంలో మూడు భాషల్లో వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. రీసెంట్ గా అబుదాబిలో ప్రభాస్ పై కొన్ని యాక్షన్ సీన్స్ కంప్లీట్ చేశారు. అలాగే రామోజీ ఫిలిం సిటీ లో వేసిన మార్కెట్ సెట్ లో కొని సన్నివేశాలను తెరకెక్కించారు. ఇప్పటివరకు తీసిన ఫుటేజ్ ఎడిటింగ్ లో సుజీత్ బిజీగా ఉంటే… ప్రభాస్ నెక్స్ట్ సినిమా షూటింగ్లో దిగిపోయారు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్న మూవీ షూటింగ్ సెప్టెంబర్ 20 నుంచి  ఇటలీలో జరుగుతోంది.

ఈ షూటింగ్ లో సెప్టెంబర్  24 న ప్రభాస్ జాయిన్ అయ్యారు. తొలి షెడ్యూల్ జోరుగా సాగుతోంది. ఈ చిత్రీకరణను చూసేందుకు వచ్చిన ఇటలీ స్థానిక అధికారులతో ప్రభాస్ మర్యాదపూర్వకంగా కలిసి ఫోటోలకి ఫోజులిచ్చారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మీసాలు లేకుండా సరికొత్త లుక్‌లో ప్రభాస్‌ అదరగొడుతున్నారు. గోపికృష్ణ మూవీస్, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. 2019 చివ‌ర్లో ఈ మూవీ థియేటర్లోకి రావచ్చని అంచనావేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus