Prabhas: ప్రభాస్‌ బర్త్ డే… మేకర్స్‌కి కొత్త టెన్షన్‌… ఫ్యాన్స్‌ని బాధపెట్టరుగా!

అభిమాన హీరో పుట్టిన రోజు అంటే ఫ్యాన్స్‌కు పండగే. సెట్స్‌ మీద ఉన్న సినిమాలు, పట్టాలెక్కబోయే సినిమాల గురించి అప్‌డేట్స్‌ వస్తాయి. త్వరలో కుదురుతాయి అనుకునే సినిమాల అప్‌డేట్స్‌ కూడా వస్తాయి. అయితే ఈ అక్టోబరు 23 మాత్రం అభిమానులకు, నిర్మాతలకు టెన్షన్‌ పెడుతోంది. ఎలాంటి అప్‌డేట్స్‌ ఇవ్వాలని నిర్మాతలకు టెన్షన్‌ అయితే, ఎలాంటి అప్‌డేట్స్‌ వస్తాయి, అసలు అప్‌డేట్స్ వస్తాయో లేదో అని అభిమానులకు టెన్షన్‌గా ఉంది. అక్టోబరు 23న అంటే ప్రభాస్‌ పుట్టిన రోజు అని మీకు ఇప్పటికే గుర్తుండి ఉంటుంది.

సెట్స్‌ మీద మూడు సినిమాలు, రిలీజ్‌కి రెడీగా ఒక సినిమా ఉన్న హీరో (Prabhas)  ప్రబాస్‌. ఇది కాకుండా పట్టాలెక్కడానికి మరో రెండు, మూడు సినిమాలు కూడా ఉన్నాయి. కానీ అప్‌డేట్స్‌ విషయానికొచ్చేసరికే ఏదీ రెడీగా లేదు అంటున్నారు. ఇంకా పుట్టిన రోజుకు పది రోజులే ఉన్నా.. ఇంకా ఏదీ రెడీగా లేకపోవడం ఆందోళన కలిగించే విషయమే అని చెప్పాలి. దీనికి కారణం ఏంటి అనేది ఇక్కడ ప్రధాన విషయం. ప్రభాస్‌ సినిమాల సంగతి చూస్తే..

నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ‘కల్కి 2898 ఏడీ’ అనే సినిమా చేస్తున్నాడు. దీని నుండి ఓ పోస్టర్‌ ఎలాగూ వచ్చేస్తుంది. అంతకుమించి ఏమీ ఎక్స్‌పెక్ట్‌ చేయలేం కూడా. ఇక మారుతి సినిమా అంటారా? ఇంకా అఫీషియల్‌ ప్రకటనే జరగలేదు. కాబట్టి పోస్టర్‌తో ఆ పని జరగొచ్చు. ‘సలార్‌ 1’ నుండి అయితే ట్రైలర్‌ రావాల్సి ఉంది. ఇప్పటికే ఓసారి డేట్‌ దాదాపు అనుకున్నా అవ్వలేదు. అయితే సినిమాకు ఇంకా రెండు నెలలకుపైగా ఉండటంతో ట్రైలర్‌ ఇప్పుడు ఇస్తారా లేదా అనేది కూడా డౌటే.

అయితే పాన్‌ ఇండియా సినిమా కాబట్టి రెండు నెలల ముందు ఈ ట్రైలర్‌తోనే ప్రచారం షురూ చేస్తారని ఓ టాక్‌. అయితే మూడు వెర్షన్లు కట్ చేసినా ఇంకా ఏదీ ఓకే అవ్వలేదని ఓ మాట శాండిల్‌ వుడ్‌ నుండి వినిపిస్తోంది. ఇవి కాకుండా ప్రభాస్‌ నుండి మరికొన్ని సినిమాలు ఉన్నాయి. అందులో సందీప్‌ రెడ్డి వంగా ‘స్పిరిట్‌’ ఒకటి. అయితే దీని నుండి విషెష్‌ తప్ప ఎలాంటి అప్‌డేట్‌ ఉండకపోవ్చు.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus