NTR: ఎన్టీఆర్ కి ఆ పిచ్చి అలవాటు ఉంది.. హాట్ టాపిక్ అయిన చరణ్ కామెంట్స్

ఏ సినిమా వేడుకలో పాల్గొన్నా ఎన్టీఆర్(NTR) అభిమానులతో కచ్చితంగా కొన్ని మాటలు చెబుతాడు. ‘దయచేసి ఇంటికి అందరూ క్షేమంగా వెళ్ళండి. ఇంటి దగ్గర మీ కోసం మీ తల్లిదండ్రులు ఎదురుచూస్తూ ఉంటారు. మీ గమ్యం మీ ఇల్లే కావాలి’ అంటూ చెబుతుంటాడు. తన సొంత బ్యానర్లో లేదా తన సినిమాల స్టార్టింగ్లో కూడా ‘అతి వేగం వద్దు’ అన్నట్టు ఒక కొటేషన్ చెబుతుంటాడు.

NTR

కానీ నిజ జీవితంలో మాత్రం ఎన్టీఆర్ కార్ ను చాలా స్పీడ్ గా నడుపుతుంటాడు అని చాలా మంది సినీ సెలబ్రిటీలు చెప్పుకొచ్చారు. పూరి జగన్నాథ్ అయితే ‘టెంపర్’ టైంలో ‘ఎన్టీఆర్ స్పీడ్ వద్దు అని అభిమానులకు చెబుతాడు కానీ తాను మాత్రం అది పాటించడు’ అని నేరుగానే చెప్పేశాడు. తాజాగా చరణ్ కూడా ఎన్టీఆర్ డ్రైవింగ్ గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశాడు. వీరిద్దరూ కలిసి ‘ఆర్.ఆర్.ఆర్’ అనే భారీ మల్టీస్టారర్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

రామ్ చరణ్ మాట్లాడుతూ… “తారక్ ఒక క్రేజీ అలాగే మ్యాడ్ డ్రైవర్. ఎన్టీఆర్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో అతని స్నేహితులు నాకు ప్రత్యేకంగా తెలిపారు. ఒక్కొక్కరు గంటల టైం తీసుకుని మరీ ఎన్టీఆర్ డ్రైవింగ్ గురించి మాట్లాడేవారు. చాలా ఉత్కంఠభరితంగా ఉంటుంది.. ఓ వింత ఫీలింగ్ వస్తుందని వాళ్ళు చెప్పారు. నాకు తెలిసి ఎన్టీఆర్ డ్రైవింగ్ తో చాలా మెమోరీస్ ఉన్నాయి.

హమ్మయ్య.. నేను సురక్షితంగా ఉన్నాను అనే ఫీలింగ్ నాకు ఎన్టీఆర్ డ్రైవింగ్లోనే అనిపించింది. కార్ ఎక్కితే అతనే డ్రైవ్ చేస్తాను అంటాడు. అతనికి డ్రైవింగ్ అంటే అంత పిచ్చి” అంటూ చెప్పుకొచ్చాడు.

7వ రోజు పెరిగాయి.. మొదటి వారం ఓకే అనిపించిన ‘ది రాజాసాబ్’.. కానీ

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus