Mrunal Thakur : మళ్ళీ ట్రెండింగ్ లోకి ధనుష్-మృణాల్.. వార్తల్లో నిజమెంత..?

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ పేరు వినగానే టాలెంట్, వెర్సటిలిటీ, హార్డ్ వర్క్ వెంటనే గుర్తొస్తాయి. తమిళంలోనే కాదు, తెలుగులో కూడా తన సినిమాలతో ప్రత్యేకమైన మార్కెట్ సంపాదించుకున్నాడు ధనుష్. ఇక మరోవైపు బాలీవుడ్ నుంచి సౌత్ వరకు వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న టాలెంటెడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ఇటీవల ఈ ఇద్దరి సినిమాలతో తమ క్రేజ్ రోజు రోజుకి ఎంత పెంచుకుంటూ వెళ్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Mrunal Thakur

ఇలాంటి సమయంలో ధనుష్-మృణాల్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారనే వార్తలు మరోసారి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా వీరిద్దరూ కలిసి ఉన్నారని చెప్పే ఒక ఫోటో వైరల్ కావడంతో, “ఇదే ప్రూఫా?” అంటూ అభిమానులు చర్చలు మొదలుపెట్టారు. ఫిబ్రవరి 14 న వాలెంటైన్స్ డే సందర్భంగా పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం కూడా ఈ రూమర్స్‌కు మరింత బలం చేకూర్చింది.అయితే ఈ వార్తలపై గతంలోనే మృణాల్ స్పందించింది. ఒక ఇంటర్వ్యూలో “మేము కేవలం మంచి స్నేహితులమే” అంటూ క్లారిటీ ఇచ్చింది. అయినా కూడా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ, పబ్లిక్ అప్పియరెన్సులు చూసి నెటిజన్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


ఇక సినిమాల విషయానికొస్తే.. ధనుష్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ముఖ్యంగా కుబేర సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. మరోవైపు మృణాల్ కూడా భారీ ప్రాజెక్టులతో బిజీగా గడుపుతూ, సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోటోషూట్స్‌తో యువతను ఆకట్టుకుంటోంది.మరి ఈ రూమర్స్‌లో నిజమెంత? లేక ఇదంతా కేవలం సోషల్ మీడియా హైప్ మాత్రమేనా? సమాధానం మాత్రం కాలమే చెప్పాలి.

Sakshi Vaidya : హీరోయిన్ అవ్వకముందు సాక్షి వైద్య.. ఆ పని చేసేదా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus