టైటిల్ హీరో ప్రభాస్

సినిమాల్లో టైటిల్ రోల్ పోషించడం అంటే భారం అంతా తన పైనే వేసుకోవడమే. ఇలాంటి పాత్రలు పోషించడానికి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఎల్లప్పుడూ ముందుంటారు. గల్లి కుర్రోడు ఈశ్వర్ గా తెరపై పయనం ప్రారంభించిన ప్రభాస్ .. మహిస్మతి రాజ్యాన్నిపాలించే రాజు అమరేంద్ర బాహుబలిగా ఎదిగాడు. అయన వేసిన ప్రతి అడుగులో తప్పు ఒప్పులనూ బేరీజు వేసుకుంటూ.. కొత్త విషయాలు నేర్చుకుంటూ సినిమా పేర్లను నిలబెడుతున్నాడు.రెబల్ స్టార్ కృష్ణం రాజు వారసుడిగా వెండితెరపై అడుగుపెట్టాడు ప్రభాస్. తొలి చిత్రంలో తన పాత్ర పేరునే టైటిల్ గా పెట్టారు. అందులో పక్కా హైదరాబాదీ కుర్రోడు ఈశ్వర్ గా ఆకట్టుకున్నాడు. నటన, డాన్స్ లో ఈజ్ చూపించి సినీ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. రెండో సినిమా కూడా హీరో స్క్రీన్ నేమ్ నే చిత్రానికి టైటిల్ గా పెట్టారు. 2003 లో వచ్చిన రాఘవేంద్ర సినిమాలో రాఘవేంద్ర గా అలరించాడు. ఈ రెండు చిత్రాలు ద్వారా తనకంటూ అభిమానులనూ ఏర్పరుచుకున్నాడు. మూడో సినిమా “వర్షం”తో తొలి కమర్షియల్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో వెంకట్ గా అందరికి గుర్తుండి పోయాడు. అయినా తన పేరును టైటిల్ గా పెట్టడం వదులుకోలేదు. అడవి రాముడులో రాముడు గా కనిపించాడు. తర్వాత చక్రం సినిమాలో కన్నీరు తెప్పించాడు. తర్వాత మళ్లీ చత్రపతి గా రికార్డులు క్రియేట్ చేశాడు.ప్రభాస్ టైటిల్ రోల్ పోషించిన దాదాపు అన్ని సినిమాలు మంచి కలక్షన్లు రాబట్టాయి. యోగి 25 సెంటర్లలో 75 రోజులు ఆడింది. మున్నా15 సెంటర్లలో 50 రోజులు పరుగులు తీసింది. బుజ్జిగాడు 200 సెంటర్లలో 50 రోజులు పాటు కాసులు కురిపించాడు. తొలి సారి ద్విపాత్రాభినయం చేసిన బిల్లా సినిమా కూడా 60 సెంటర్లలో 50 రోజులు విజయవంతంగా దూసుకుపోయింది.ప్రభాస్ పేరుని ప్రపంచం మొత్తం పరిచయం చేసిన సినిమా బాహుబలి. ఇందులో అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలిగా నటించాడు. రాజు పేదగా మెప్పించాడు. ఈ చిత్రానికి ముగింపుగా వచ్చే చిత్రం పేరు కూడా బాహుబలినే. ఆనాడు చత్రపతి తో టైటిల్ హీరోగా పేరు సంపాదించుకున్నా ప్రభాస్ బాహుబలితో ఆ పేరుని నిల బెట్టుకున్నాడు.

చక్రం, పౌర్ణమి, ఏక్ నిరంజన్, డార్లింగ్, మిస్టర్ పర్ఫక్ట్, రెబల్, మిర్చి.. హీరో పేరుతో కాకుండా టైటిల్ పెట్టిన ప్రభాస్ సినిమాలు ఇవి. వీటిలో కూడా విజయవంతమైన చిత్రాలున్నాయి. వీటిలో గమనించిన విషయాలు ఏమిటంటే రియల్ లైఫ్ లో ప్రభాస్ మిస్టర్ పర్ఫక్ట్. అమ్మాయిలందరూ అతన్ని డార్లింగ్ అని పిలుచుకుంటారు. రెబల్ అనేది తన బిరుదు. ఇలా ఇవి కూడా ప్రభాస్ వ్యక్తిత్వానికి దగ్గరగా ఉంటాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus