యంగ్ రెబల్ స్టార్ తర్వాతి సినిమాలో హీరోయిన్ పై చర్చ

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి కంక్లూజన్ తర్వాత చేసే సినిమాలు ఖరారయ్యాయి. ఈ రెండు చిత్రాలు  యూవీ బ్యానర్లోనే ఉంటాయని డార్లింగ్ అందరికి స్పష్టం చేశారు. బాలీవుడ్ ఆఫర్లను సైతం కాదని  ‘రన్ రాజా రన్’ ఫేం సుజిత్ కి తన డేట్లను కేటాయించారు.150 కోట్లతో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నిర్మించనున్న ఈ మూవీకి లొకేషన్ ను వెతికే పనిలో సుజిత్ బిజీ అయ్యారు. అన్నీ బాగానే ఉన్నాయి కానీ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ నటించనున్న ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరనే దానిపై అభిమానులకు ఇంకా క్లారిటీ రాలేదు. ఈ సినిమాలో డార్లింగ్ సరసన అమీ జాక్సన్ నటించనున్నట్లు మొదట్లో వార్తలు వినిపించాయి.

ప్రస్తుతం ఆ స్థానంలో బాలీవుడ్ క్రేజీ నటి పరిణీతిచోప్రా వచ్చి చేరిందని టాక్. ఈ విషయంపై  చిత్రబృందం ఎటువంటి ప్రకటన చేయలేదు. డిసెంబర్ లో పూజ కార్యక్రమాలు జరుపుకొని జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనున్న ఈ మూవీలో అమీ జాక్సన్, పరిణీతి చోప్రా లతో పాటు మరో ఇద్దరు భామలు ప్రభాస్ తో రొమాన్స్ చేయనున్నట్లు తాజా సమాచారం. ఈ చిత్రానికి బాలీవుడ్ లో మంచి ఓపెనింగ్స్ రావాలని ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. వీరి హడావుడి చూస్తుంటే  ఇందులో జేమ్స్ బ్యాండ్ సినిమాలోని యాక్షన్ సీన్స్ తో పాటు లిప్ లాక్  సీన్లు కూడా ఉంటాయనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus