ప్రభాస్ ని గండం నుంచి తప్పించిన కృష్ణంరాజు!

ఏ రంగం లోనైనా ముందుకు వెళ్లాలంటే.. అందులో అనుభవం ఉన్న వారి సలహాలు పాటిస్తుండాలి. లేకుంటే ఎదురుదెబ్బలు తినక తప్పదు. ఆ విషయంలో ప్రభాస్ జాగ్రత్తగా ఉంటారు. కెరీర్ మొదటి నుంచి తన పెదనాన్న కృష్ణం రాజు సలహాలను తప్పకుండా పాటిస్తుంటారు. బాహుబలి తో దేశవ్యాప్తంగా పేరు వచ్చినప్పటికీ టాలీవుడ్ పరిధిని దాటకుండా ఉన్నారు. అలాగే అనవసరపు వివాదాల్లోకి వెళ్లి.. నోరు జారకుండా అభిమానాన్ని కాపాడుకున్నారు.

రీసెంట్ గా ఇలాంటి సంఘటన మరొకటి జరిగింది. బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ రూపొందిస్తున్న “పద్మావతి” సినిమాపై విమర్శల పర్వం కొనసాగుతోంది. రాణి పద్మినీ దేవి పాత్రను వక్రీకరించి సినిమాను తెరకెక్కిస్తున్నారని, సినిమా విడుదలను నిలిపి వేయాలని రాజ్ పుత్ కర్నిసేన డిమాండ్ చేస్తోంది. దీంతో ప్రస్తుతానికి ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు. అయితే మరోపక్క కర్నిసేన క్షత్రియులు అందరూ కూడా ఈ విషయంపై స్పందించాలని ఆదేశారు జారీ చేసింది. రాజుల కుటుంబానికి చెందిన ప్రముఖులను ఈ వివాదంలోకి లాగుతున్నారు. మొత్తానికి “పద్మావతి”తో కులం, మతం అన్నింటినీ తెరపైకి తీసుకొస్తున్నారు. తాజాగా రెబెల్ స్టార్ ప్రభాస్ కూడా దీనిపై స్పందించాలని  కర్నిసేన ప్రయత్నించింది. బాహుబలి చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రభాస్ ఈ విషయంపై స్పందిస్తే..  తమకి బలం పెరుగుతుందని భావించింది.

అయితే ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు మాత్రం ఇలాంటి కులం గొడవల్లోకి వెళ్తే   కెరీర్ మీద ప్రభావం పడే అవకాశాలున్నాయని చెప్పడంతో ప్రభాస్ సైలెంట్ గా ఉండిపోయాడట. లేకుంటే కులాల  గొడవల్లో ప్రభాస్ సినీ కెరీర్ కలిసిపోయేది. ఈ విధంగా ప్రభాస్ ని పెద్ద ప్రమాదం నుంచి కృష్ణం రాజు తప్పించారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus