పవన్, ప్రభాస్, అల్లు అర్జున్ లు రంగస్థలం సినిమాని ఎప్పుడు చూస్తారు ?

  • April 7, 2018 / 08:25 AM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, సుకుమార్ కలయికలో వచ్చిన రంగస్థలం సినిమాకి తెలుగు సినీ అభిమానులు బ్రహ్మరధం పడుతున్నారు. వారం రోజుల్లో 130 కోట్లు వసూళ్లు చేసిన ఈ సినిమాని తెలుగు సినీ స్టార్లు, డైరక్టర్లు చూసి టీమ్ మొత్తాన్ని అభినందనలతో ముంచెత్తుతున్నారు. మెగా అభిమానులు ఈ చిత్రాన్ని ఇప్పటికే రెండు, మూడు సార్లు చూసారు. అయినా ఇంతవరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రెబల్ స్టార్ ప్రభాస్ ఈ చిత్రాన్ని ఒక్కసారి కూడా చూడలేదు. ఈ ముగ్గురు రామ్ చరణ్ కి అత్యంత కావలసినవారు.. అయినా ఇంతవరకు ఎందుకు చూడలేదని ఆరాతీయగా అసలు కారణాలు బయటికి వచ్చాయి. ప్రత్యేక హోదా కోసం జనసేనానిగా పవన్ కళ్యాణ్ పాదయాత్ర చేస్తున్నారు.

ఈ సీరియస్ విషయంపై రాజకీయ నేతలతో చర్చలతో బిజీగా ఉన్నారు, ఇక ప్రభాస్ విషయానికి వస్తే.. గత పదిరోజులుగా ఈయన దుబాయ్ లోనే ఉన్నారు. సుజీత్ దర్శకత్వంలో చేస్తున్న సాహో మూవీలోని కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కించనున్నారు. అందుకోసం హాలీవుడ్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ ఆధ్వర్యంలో సాధన చేస్తున్నారు. మరో మూడు రోజుల్లో షూటింగ్ మొదలు కానుండడంతో ప్రాక్టీస్ పై దృష్టిపెట్టారు. అల్లు అర్జున్ నా పేరు సూర్య షూటింగ్ ని కంప్లీట్ చేసుకొని వారం రోజుల క్రితం హైదరాబాద్ కి వచ్చారు. ఈ సినిమాని వచ్చే నెలలో రిలీజ్ చేయాలనీ.. ఆలస్యం జరగకుండా ఉండాలని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని దగ్గరుండి చేయిస్తున్నారు. ఈ కారణాల వల్ల.. రంగస్థలం సినిమా చూడలేదు. కొంచెం వారి పని ఒత్తిడి తగ్గగానే సినిమా చూసి తమ అభిప్రాయాన్ని షేర్ చేయనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus