Kalki Trailer: ప్రభాస్ అభిమానులకు తీపికబురు.. కల్కి ట్రైలర్ వచ్చేది అప్పుడేనా?

ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కల్కి 2898 ఏడీ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా ఈ సినిమా రిలీజ్ కు మరో రెండు నెలల సమయం మాత్రమే ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో వేగం పెంచాలని ఫ్యాన్స్ కోరుకుంటుండగా ఈ సినిమా ట్రైలర్ కు సంబంధించిన ఒక అప్ డేట్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న అప్ డేట్ ప్రకారం ఏప్రిల్ మొదటి వారంలో ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ కానుంది.

సినిమా రిలీజ్ కు సరిగ్గా నెల రోజుల ముందు ట్రైలర్ విడుదలయ్యే విధంగా మేకర్స్ ప్లాన్ ఉంది. ఈ ఏడాది రిలీజవుతున్న తొలి భారీ పాన్ ఇండియా మూవీ కల్కి 2898 ఏడీ కావడంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ ఏడాదికి కనీసం ఒక సినిమాను రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేస్తే ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు 200 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండే అవకాశం ఉంది. ఇతర భాషలకు చెందిన ప్రముఖ నటులు నటించడం ఈ సినిమాకు ప్లస్ అవుతోంది. దర్శకుడు నాగ్ అశ్విన్ క్యాస్టింగ్ తోనే ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశారు. ప్రభాస్ ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటే మాత్రం అంచనాలు భారీగా పెరుగుతాయి.

వైజయంతీ మూవీస్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఆ బ్యానర్ కు సెంటిమెంట్ తేదీ అయినా మే 9వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుండటం గమనార్హం. కల్కి మూవీ విడుదలైన తర్వాత ప్రభాస్ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన అప్ డేట్స్ వస్తాయని తెలుస్తోంది. సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.

ఆపరేషన్ వాలెంటైన్ సినిమా రివ్యూ & రేటింగ్!

భూతద్ధం భాస్కర్ నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
చారి 111 సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus