మాస్ మహారాజ్ రవితేజ సోలో హీరోగా హిట్టు కొట్టి 3 ఏళ్ళు దాటింది. ‘ధమాకా’ తర్వాత రవితేజకి ఒక్క హిట్టు కూడా పడలేదు. ‘రావణాసుర’ ‘టైగర్ నాగేశ్వరరావు’ ‘ఈగల్’ ‘మిస్టర్ బచ్చన్’ ‘మాస్ జాతర’ వంటి సినిమాలు అన్నీ డిజాస్టర్లు అయ్యాయి. దీంతో ఫ్యామిలీ జోనర్ కి షిఫ్ట్ అయ్యి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి'(Bhartha Mahasayulaku Wignyapthi) అనే సినిమా చేశాడు రవితేజ. కిషోర్ తిరుమల దీనికి దర్శకుడు. డింపుల్ హయాతి, ఆషిక రంగనాథ్..లు హీరోయిన్లుగా నటించారు.
ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన ‘బెల్లా బెల్లా’ సాంగ్, ‘అద్దం ముందు నిలబడి’, ‘వామ్మో వాయ్యో’ వంటి పాటలు అన్నీ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. టీజర్, ట్రైలర్ వంటివి కూడా హోప్స్ ఇచ్చాయి. ఆల్రెడీ ఈ చిత్రాన్ని ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది పెద్దలకి, రవితేజ స్నేహితులకు చూపించారట మేకర్స్. సినిమా చూసిన తర్వాత తమ అభిప్రాయాన్ని కూడా షేర్ చేసుకున్నారు.వారి టాక్ ప్రకారం.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా 2 గంటల 22 నిమిషాల నిడివి కలిగి ఉందట.
సినిమా ఫస్ట్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్ గా మొదలైందట. రవితేజ, వెన్నెల కిషోర్, మురళీధర్ గౌడ్ వంటి వారి కామెడీ ఆకట్టుకుంటుందట. ఆషిక రంగనాథ్ గ్లామర్ కూడా హైలెట్ అని అంటున్నారు.సునీల్ కామెడీ కూడా ఫస్ట్ హాఫ్ లో ఆకట్టుకుంటుందట. తర్వాత సత్య ఎంట్రీ ఇచ్చి.. కామెడీ అదరగొడతాడని అంటున్నారు. మొత్తంగా వెన్నెల కిషోర్, సత్య, సునీల్..ల కామెడీ బాగా వర్కౌట్ అయ్యింది అంటున్నారు.
క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ కూడా ఆకట్టుకుంటాయట. కచ్చితంగా ఈ సంక్రాంతికి రవితేజ సైలెంట్ గా హిట్టు కొట్టడం గ్యారెంటీ అంటున్నారు. చూడాలి మరి ఏమవుతుందో..!