Chiranjeevi : మెగాస్టార్ తో మాజీ ప్రపంచ సుందరి.. వార్తల్లో నిజమెంత?

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతి బరిలో నిలిచిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీ రిలీజ్ లో బిజీ బిజీగా ఉన్నారు. అయితే నిన్న (11 జనవరి)న ప్రీమియర్స్ షోస్ ద్వారా దాదాపుగా చాలా చోట్ల పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ముఖ్యంగా సంక్రాంతికి ఫ్యామిలి ఆడియన్స్ కి పర్ఫెక్ట్ మూవీ ఇచ్చారు అని ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. కొంత మంది అయితే డైరెక్టర్ అనిల్ రావిపూడికి తెలుగు ఆడియన్స్ పల్స్ తెలిసినంతగా ఇంకా ఎవరికీ తెలీదు అని అంటున్నారు. అయితే ఇది ఇలా ఉండగా నెట్టింట చిరు నెక్స్ట్ మూవీ కి సంబందించిన ఒక వార్త ట్రేండింగ్ లోకి వచ్చింది. అదేంటో చూసేద్దాం రండి..

Chiranjeevi

మెగా 158 గా చిరంజీవి తదుపరి చిత్రం డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో గ్రాండ్ గా తెరకెక్కనున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ మూవీ లో మెగాస్టార్ సరసన మాజీ ప్రపంచ సుందరి అందాల భామ ఐశ్వర్యారాయ్ నటించనున్నట్లు సమాచారం. ఇదే నిజం అయితే చిరు – ఐష్ జంటగా తొలిసారి సిల్వర్ స్క్రీన్ పై అభిమానులకు కన్నుల పండుగే అని చెప్పొచ్చు. దీంతో పాటు ఈ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ కూడా ఒక కీలక పాత్రలో నటించబోతున్నారని వినికిడి. ఈ చిత్రానికి మ్యూజిక్ కోసం ఏ ఆర్ రెహమాన్ ని సంప్రదించారు అంట డైరెక్టర్ బాబీ. ఈ మూవీని మేకర్స్ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేద్దాం అని ప్లాన్ చేస్తున్నారట.

 

Dasari Narayanarao : ఆ హీరోయిన్ దాసరి మనువరాలా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus