Mana ShankaraVaraprasad Garu: ఈ మైనస్ పాయింట్స్ లేకపోతే ‘మనశంకర్ వరప్రసాద్ గారు’ కి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చి ఉండేది కదా

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana ShankaraVaraprasad Garu) సినిమా ఈరోజు అనగా జనవరి 12న రిలీజ్ అయ్యింది. నిన్న రాత్రి నుండే చాలా ఏరియాల్లో ప్రీమియర్ షోలు పడ్డాయి. ఫ్యాన్స్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి పాజిటివ్ టాక్ చెబుతున్నారు. కానీ మిగతా ప్రేక్షకుల నుండి మిక్స్డ్ రెస్పాన్స్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనం కూడా లేట్ చేయకుండా ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ లోని ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

Mana ShankaraVaraprasad Garu

ముందుగా ప్లస్ పాయింట్స్

1) చిరు ఎంట్రీ సీన్ చాలా సింపుల్ గా ఉంది. ఆ తర్వాత వచ్చే ఫైట్ సీక్వెన్స్ లో చిరు అదరగొట్టేశారు. శరత్ సక్సేనా తో చిరు కాంబినేషనల్ సీన్స్ చూసినప్పుడు మనకి ‘ముఠామేస్త్రి’ రోజులు గుర్తుకొస్తాయి. కాకపోతే ఈ సినిమాలో ఆయన పాజిటివ్ రోల్ ప్లే చేయడం అనేది మరో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్. గతంలో కూడా ‘బన్నీ’ వంటి సినిమాల్లో ఆయన పాజిటివ్ రోల్ చేశారు. కానీ చిరుతో కలిసి కామెడీ పంచులు పలకడం అనేది ఆడియన్స్ కి కూడా ఒకరకమైన పాజిటివ్ ఫీలింగ్ కలిగిస్తుంది.

2) ఫస్ట్ సాంగ్ ‘హుక్ స్టెప్’ కావడం మరో ప్లస్ పాయింట్. ఎందుకంటే వెంటనే ఆడియన్స్ కి ఒక రకమైన రిఫ్రెష్మెంట్ ఫీలింగ్ కలిగిస్తుంది.

3) అన్నట్టు గతంలో చిరు ఓ ఈవెంట్లో ‘ఇందువదన’ సాంగ్ పాడి ట్రోల్ అయ్యారు. దానిని ఈ సినిమాలో కామెడీ గా పెట్టారు. చిరుతోనే ఆ సీన్ చేయించడం..తర్వాత వావ్ అనిపించడం.. అందరూ తెగ నవ్వుకునేలా చేస్తుంది. సినిమాలో బెస్ట్ కామెడీ సీన్ అంటే డౌట్ లేకుండా ఇదే అని చెప్పాలి.

4) చిరు- నయనతార..ల మధ్య లవ్ ట్రాక్ ని ఫాస్ట్ గా తేల్చేశారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ లో వెంకీ- ఐశ్వర్య..ల ట్రాక్ మాదిరి అలా చేయడం జరిగింది. అది ఆడియన్స్ కి బోర్ కొట్టించకుండా ఫాస్ట్ గా సాగినట్టు అయ్యింది.

5) సెకండాఫ్ లో మారియట్ హోటల్ సీన్లో లేడీస్ పై చిరు వేసే పంచ్..లు ఆకట్టుకుంటాయి.

6) ఒక సీన్లో చిరు తల్లి పాత్ర హీరోయిన్ నయనతార వద్దకి వెళ్లి గోంగూర పచ్చడి ఇచ్చి కాఫీ కూడా పెట్టిస్తుంది. అక్కడ వచ్చే డైలాగులు హృద్యంగా అనిపిస్తాయి. ఈ ఒక్క సీన్ చాలు.. ఫ్యామిలీ ఆడియన్స్ పాస్ మార్కులు వేసేయడానికి అనిపిస్తుంది.

7) వెంకటేష్ ఎంట్రీ సీన్ అదిరిపోయింది. అలాగే సాంగ్స్ పిక్చరైజేషన్ కూడా బాగుంది.

ఇప్పుడు మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చేద్దాం

8) ‘మన శంకరవరప్రసాద్ గారు’ కథలో చాలా సినిమాల రిఫరెన్సులు కనిపిస్తాయి. చిరంజీవి గతంలో చేసిన ‘డాడీ’ సినిమానే కొంచెం అటు ఇటుగా మార్చి వెంకటేష్ ‘తులసి’ గా చేశాడు. ఆ సినిమాల స్ఫూర్తితోనే తమిళంలో అజిత్ ‘విశ్వాసం’ కూడా రూపొందింది. ఇక మామగారి ట్రాక్ చూస్తే.. చిరంజీవి ‘మృగరాజు’.. హీరోయిన్ అహంకారం సన్నివేశాలు చూస్తే ‘ఘరానామొగుడు’.. ఫస్ట్ ఫైట్ దగ్గర వచ్చే కామెడీ సీన్స్ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’, హీరో ప్రొఫెషన్ ని బట్టి ‘సంక్రాంతికి వస్తున్నాం’ అబ్బో ఇలా చెప్పుకుంటూపోతే చాలా సినిమాల పోలికలు కనిపిస్తాయి.

9) ‘సంక్రాంతికి వస్తున్నాం’ రేంజ్లో ‘మనశంకర వరప్రసాద్ గారు’ కన్విన్స్ చేసే అవకాశాలు తక్కువ. ‘సంక్రాంతికి వస్తున్నాం’లో రేవంత్(బుల్లిరాజు) కామెడీ సీన్స్ బాగా హైలెట్ అయ్యాయి. అందుకే ఏరికోరి ‘మనశంకర వరప్రసాద్ గారు’ సినిమాలో రేవంత్ ని పెట్టారు. కానీ ఇందులో మాత్రం అతని కామెడీ తేలిపోయింది. పైగా అతన్ని తిండిబోతు అన్నట్టు డైలాగులు పెట్టి మరీ కామెడీ పండించాలి అనుకోవడం.. అనిల్ ‘అతి’కి పరాకాష్ట అనాలి. అలాగే ఆ సన్నివేశాల్లో రేవంత్ ని చూసి కొంతమంది జాలి పడినా ఆశ్చర్యపోనవసరం లేదు.

10)ఫస్ట్ హాఫ్ చాలా బోరింగ్ గా అనిపిస్తుంది. ముఖ్యంగా మామ కేరెక్టర్ చేసిన సచిన్ కేడెకర్ పాత్రతో ఇంటర్వెల్ సీక్వెన్స్ వద్ద ఓ పాట పాడించారు. దానికి కౌంటర్ గా హీరోతో ఆ పాటని కంటిన్యూ చేయించారు. అది ‘అల వైకుంఠపురములో’ సినిమాలో ‘సిత్తరాల సిరపడు’ పాట స్పూర్తితో సంక్రాంతి ఆడియన్స్ ని ఆకర్షించాలని పెట్టినట్టు ఉంది తప్ప కథలో సింక్ అవ్వలేదు.

మన శంకరవరప్రసాద్ గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus