Prabhas : ‘రాజాసాబ్’ OTT డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

తెలుగు డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హారర్ కామెడీ జానర్ లో తెరకెక్కిన మూవీ ‘రాజాసాబ్’. 2026 పొంగల్ బరిలో జనవరి 9న మొదటిగా విడుదలై ప్లాప్ టాక్ మూటకట్టుకుంది. ఆడియన్స్ అంచనాలను ఆకాశానికి ఎత్తేసిన డైరెక్టర్ చివరికి సినిమా విషయంలో అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. దీంతో ఆగ్రహానికి గురైన అభిమానులు దర్శకుడు మారుతీ ఇంటికి ఆన్లైన్ ద్వారా ఆర్డర్లు పెడుతూ ఇబ్బందికి గురిచేస్తున్నారు. ఇది ఇలా ఉండగా, ‘రాజాసాబ్’ OTT లో రిలీజ్ కు సిద్ధమయింది. అది ఎప్పుడంటే..

Prabhas

వచ్చే నెల ఫిబ్రవరి 6 నుంచి ఆన్లైన్లో మూవీ స్ట్రీమింగ్ అవ్వనున్నట్లు జియో హాట్ స్టార్ పేర్కొంది. మొత్తం నాలుగు లాంగ్వేజెస్ లో అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. కాగా ఈ మూవీలో నిధి అగర్వాల్, మాళవికామోహన్ మరియు రిధి కుమార్ ముగ్గురు భామలు హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ స్వరాలు అందించగా , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో విశ్వ ప్రసాద్ నిర్మించారు. గ్రాఫిక్స్ కోసం భారీగా ఖర్చుపెట్టినా కూడా చివరికి అవి కూడా అంతగా మెప్పించలేకపోయాయి అని టాక్. అయితే ఫిబ్రవరి 6న OTT లోకి రానున్న ఈ మూవీ ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

ఇది ఇలా ఉండగా, ప్రభాస్ తన తదుపరి ప్రోజెక్టుల షూటింగ్స్ లో బిజీ బిజీగా వున్నాడు. అయితే హను రాఘవపూడి డైరెక్షన్లో అన్నిటికంటే ముందు షూటింగ్ షూటింగ్ స్టార్ట్ చేసిన ‘ఫౌజీ’ రిలీజ్ కు వెనుక పడగా, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ మూవీ ఈ ఇయర్ సమ్మర్ లో విడుదలకు సిద్దమవుతుంది అని సినీ వర్గాల నుంచి సమాచారం.

Vishwambhara: ‘విశ్వంభర’… చిరు చెప్పినట్టు జరగడం లేదుగా!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus