Prabhas: తమిళ దర్శకుడికి ‘నో’ చెప్పిన ప్రభాస్!

  • June 1, 2022 / 12:57 PM IST

‘ఖైదీ’ సినిమా తరువాత కోలీవుడ్ లో వాంటెడ్ డైరెక్టర్ గా మారిపోయారు లోకేష్ కనగరాజ్. కార్తి హీరోగా నటించిన ఈ సినిమా తమిళంలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బాగా ఆడింది. ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో విజయ్ లాంటి స్టార్ హీరోని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశారు లోకేష్. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘మాస్టర్’ మరో హిట్టు. కమర్షియల్ గా మంచి సక్సెస్ అందుకుంది.

ప్రస్తుతం లోకేష్ డైరెక్ట్ చేసిన ‘విక్రమ్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ లాంటి స్టార్ హీరోలు నటించారు. అలానే నటుడు సూర్య క్యామియో రోల్ లో కనిపించనున్నారు. దీంతో సినిమాపై బజ్ ఓ రేంజ్ లో వచ్చింది. ఈ సినిమాను తమిళంతో పాటు ఇతర భాషల్లో కూడా విడుదల చేయనున్నారు. తెలుగులో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై రిలీజ్ చేయనున్నారు.

స్ట్రెయిట్ ఫిలిం మాదిరి ఈ సినిమా ప్రమోషన్స్ చేపట్టారు. ఈ సినిమా కోసం కొన్ని రోజులుగా హైదరాబాద్ లోనే ఉంటున్నారు దర్శకుడు లోకేష్. నిజానికి తన తదుపరి సినిమా ఓ తెలుగు హీరోతో చేయాలనేది లోకేష్ ప్లాన్. దానికి తగ్గట్లుగానే కొందరు స్టార్ హీరోలను కలిసి కథలు వినిపిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రామ్ చరణ్ ని కలిసినట్లు టాక్. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ దర్శకుడు ప్రభాస్ ను మీట్ అయినట్లు తెలుస్తోంది.

అంతేకాదు.. ప్రభాస్ కి ఓ కథను చెప్పారట. కానీ ప్రభాస్ ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఒప్పుకోలేదట. లోకేష్ చెప్పిన కథ సీరియస్ యాక్షన్ ఫిల్మ్ అట. కానీ ప్రభాస్ లార్జర్ థన్ లైఫ్ రేంజ్ లో ఉండే కథలు చేయాలనుకుంటున్నారు. అతడి లైనప్ కూడా అలానే ఉంది. ఇలాంటి సమయంలో రొటీన్ యాక్షన్ సినిమా చేయడం ఇష్టం లేక ‘నో’ చెప్పినట్లు తెలుస్తోంది. మరి లోకేష్ కి తెలుగు హీరోలు దొరుకుతారో లేదో చూడాలి!

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus