ఆ డైరెక్టర్ తో ప్రభాస్ సినిమా చేయడం లేదు

బాహుబలి 2 తర్వాత యంగ్ రెబల్ స్టార్ ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ డైరెక్షన్లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. యువీ క్రియేషన్స్ బ్యానర్లో భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న సాహో మూవీ రెండు షెడ్యూల్ పూర్తి అయింది. మూడో షెడ్యూల్ దుబాయ్ లో ప్లాన్ చేస్తే.. అక్కడ అనుమతులు దొరక్కపోవడంతో రామోజీ ఫిలిం సిటీలోనే మూడో షెడ్యూల్ చేయనున్నారు. విదేశాల్లో రెస్ట్ తీసుకుంటున్న ప్రభాస్ ఇండియాకి రాగానే షూటింగ్ ప్రారంభిస్తారు. ఈ షెడ్యూల్ తర్వాత దుబాయ్ శివార్లలో భారీ యాక్షన్ సీన్ తెరకెక్కించనున్నారు. ఈ చిత్రం తర్వాత జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు.

గోపి కృష్ణ ఫిలిమ్స్ బ్యానర్లో కృష్ణం రాజు సినిమాని నిర్మించనున్నట్లు తెలిసింది. అయితే ఈ చిత్రం తర్వాత కోలీవుడ్ లో మెర్సల్ సినిమాను తీసి బిగ్గెస్ట్ హిట్ అందుకున్న దర్శకుడు అట్లీ తో మరొక సినిమాను చేయనున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ న్యూస్ నిజమని అభిమానులు సంబరపడ్డారు. అయితే ఈ వార్తలను అట్లీ ఖండించారు. ప్రస్తుతం తాను కథ రాసే పనిలో బిజీగా ఉన్నానని చెప్పారు. ఆ కథలో ఎవరు నటిస్తారో అనే విషయం ఇంకా ఖరారు కాలేదని స్పష్టం చేశారు. దీంతో ప్రభాస్, అట్లీ సినిమా వార్తలకు బ్రేక్ పడింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus