Prabhas: భక్త కన్నప్ప సినిమాకు ప్రభాస్ రెమ్యునరేషన్ అంత తక్కువా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. భక్త కన్నప్ప సినిమాలో ప్రభాస్ నటిస్తున్నట్టు ప్రకటన వెలువడగా ఈ ప్రకటన కొంతమందిని ఆశ్చర్యానికి గురి చేస్తే మరి కొంతమందిని షాక్ కు గురి చేస్తోంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో 10 నిమిషాల నిడివి ఉన్న శివుడి పాత్రలో ప్రభాస్ కనిపించనున్నారు. అయితే ఈ సినిమా కోసం ప్రభాస్ పారితోషికం ఎంత అనే చర్చ జరుగుతుండగా ప్రభాస్ రెమ్యునరేషన్ కు సంబంధించి ఒక వార్త ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్ అవుతోంది.

ప్రభాస్ (Prabhas) ఈ సినిమాకు రూపాయి కూడా తీసుకోవడం లేదని తెలుస్తోంది. భక్త కన్నప్ప రోల్ కృష్ణంరాజుకు ఇష్టమైన రోల్ కావడంతో పాటు మంచు ఫ్యామిలీతో అనుబంధం ఉన్న నేపథ్యంలో ప్రభాస్ తనకు పారితోషికం వద్దని చెప్పారని తెలుస్తోంది. ప్రభాస్ ఈ సినిమా కోసం ఒకటి లేదా రెండు రోజులు డేట్స్ కేటాయిస్తే చాలని సమాచారం అందుతోంది. బుజ్జిగాడు సినిమాలో ప్రభాస్ మోహన్ బాబు కలిసి నటించిన సంగతి తెలిసిందే. మంచు విష్ణు దేనికైనా రెడీ సినిమాలో ప్రభాస్ వాయిస్ కు సంబంధించి కొన్ని సీన్లు ఉన్నాయి.

భక్త కన్నప్ప మూవీ ఏకంగా 150 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ప్రభాస్ నటించడం ఈ సినిమా మేకర్స్ కు ప్లస్ కానుంది. రెబల్ స్టార్ ప్రభాస్ త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని ఈ ప్రాజెక్ట్ లు అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్నాయని సమాచారం అందుతోంది. ప్రభాస్ సలార్ రిలీజ్ డేట్ కు సంబంధించి త్వరలో క్లారిటీ రానుంది. సలార్ డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోవడంతో త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి కూడా పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు.

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus