Prabhas: ఆ సీనియర్ డైరెక్టర్ అంటే స్టార్ హీరో ప్రభాస్ కు ఇంత గౌరవమా?

  • September 28, 2024 / 06:22 PM IST

స్టార్ హీరో ప్రభాస్ కు (Prabhas) ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. ప్రభాస్ ఏ సినిమాలో నటించినా బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందేనని ప్రభాస్ గత సినిమాలు బాక్సాఫీస్ వద్ద ప్రూవ్ చేశాయి. సలార్ (Salaar), కల్కి (Kalki 2898 AD) సినిమాలు ప్రభాస్ ఇమేజ్, రేంజ్ ను ఎన్నో రెట్లు పెంచేశాయి. ప్రభాస్ మాట ఇస్తే సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా డైరెక్టర్ డైరెక్షన్ లో నటిస్తాడనే సంగతి తెలిసిందే. రెమ్యునరేషన్ పరంగా కూడా ప్రభాస్ టాప్ లో ఉన్నారు.

Prabhas

అయితే ఒకానొక సమయంలో రాఘవేంద్రరావు డైరెక్షన్ లో నటిస్తానని ప్రభాస్ కామెంట్లు చేయడం గమనార్హం. ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ భక్తిరస సినిమాలకు పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని రాఘవేంద్రరావు చెప్పడంతో పాటు అవకాశం వస్తే ప్రభాస్ తో భక్తిరస సినిమా చేస్తానని ఆయన వెల్లడించారు. ఆ కామెంట్లకు ప్రభాస్ స్పందిస్తూ రాఘవేంద్రరావు (Raghavendra Rao) కోరితే నోరు మూసుకుని సినిమా చేస్తానని తెలిపారు. పెద్దలంటే తనకు ఎంత గౌరవమో ప్రభాస్ తన కామెంట్ల ద్వారా చెప్పకనే చెప్పేశారు.

ప్రభాస్ ది రాజాసాబ్ (The Rajasaab) సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో పాటు మరోసారి బాక్సాఫీస్ వద్ద తన పవర్ చూపిస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నరు. ది రాజాసాబ్ మూవీలో ఫ్యాన్స్ కు నచ్చే, ఫ్యాన్స్ మెచ్చే అంశాలు ఒకింత ఎక్కువగానే ఉండనున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పెద్ద సినిమాలు పాజిటివ్ టాక్ వస్తే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల విషయంలో అదరగొడుతున్న సంగతి తెలిసిందే.

పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు ఉన్న ప్రభాస్ ఇతర భాషల్లో సైతం పెద్దగా ప్రమోషన్స్ లేకుండానే తన సినిమాలతో మ్యాజిక్ చేస్తున్నారు. ప్రభాస్ టాలీవుడ్ ఇండస్ట్రీ స్థాయిని పెంచుతున్నారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ రెమ్యునరేషన్ భారీ రేంజ్ లో ఉన్నా ప్రభాస్ తన సినిమాలతో ఆ రెమ్యునరేషన్ కు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తున్నారనే చెప్పాలి.

 దేవర సీక్వెల్ లో ఆ పాత్ర మరణం వెనుక అసలు ట్విస్ట్ ఇదేనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus