బుర్జ్ ఖలీఫా సమీపంలో సాహో షూటింగ్ ఖాయం : నీల్ నితిన్ ముకేష్

యంగ్ డైరక్టర్ సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సాహో (Saaho) గురించి ఒక వార్త కొన్ని రోజులుగా చక్కర్లు కొట్టింది. దుబాయిలోని అబుదాబి వద్ద యాక్షన్ సీన్ షూటింగ్ కి అక్కడి అధికారులు ఒప్పుకోకపోవడంతో ఆ ఫైట్ సీన్ ని రామోజీ ఫిలిం సిటీ లో సెట్ వేసి చిత్రీకరిస్తున్నట్టు అందరూ చెప్పుకున్నారు. అయితే ఈ వార్తలో వాస్తవం లేదని నీల్ నితిన్ ముకేష్ చెప్పారు. ఈ బాలీవుడ్ నటుడు సాహోలో ప్రభాస్ కి మెయిన్ విలన్ గా కనిపించబోతున్నారు. వీరిద్దరి మద్యే భారీ యాక్షన్ సీన్ ప్లాన్ చేశారు.

మొదటి అనుమతి లభించకపోయిన మాట వాస్తవమే అని. అయితే బుర్జ్ ఖలీఫా సమీపంలో సాహో షూటింగ్ కి పర్మిషన్ లభించిందని నీల్ స్పష్టం చేశారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందంగా ఉన్నారు. ప్రస్తుతం యాక్షన్ సీన్స్ కోసం చిత్ర యూనిట్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల మూడో వారం నుంచి దుబాష్ షెడ్యూల్‌ షూటింగ్ మొదలు కానుంది. బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ,ప్రమోద్ లు నిర్మిస్తున్నారు. ఏకకాలంలో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus