Prabhas: అమితాబ్ , కమల్..ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ప్రభాస్
- June 20, 2024 / 11:46 AM ISTByFilmy Focus
కల్కి (Kalki 2898 AD)ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో నిర్వహిస్తున్నారు మేకర్స్. ఈరోజు ముంబైలో స్పెషల్ గా ఓ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. ఇందులో హీరో ప్రభాస్ తో (Prabhas) పాటు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), కమల్ హాసన్, (Kamal Haasan) దీపికా పదుకోనె (Deepika Padukone), దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin), అశ్వినీ దత్ లు (C. Aswani Dutt) సందడి చేశారు. ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ దీపికా పదుకోనె ల గురించి ప్రభాస్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి.
ప్రభాస్ మాట్లాడుతూ.. “గ్రేటెస్ట్ లెజెండ్స్ తో వర్క్ చేసే అవకాశం నాకు ఇచ్చిన దత్తు గారికి, నాగీ గారికి థాంక్ యూ. ఇట్స్ బిగ్గర్ దేన్ ఏ డ్రీం అని చెప్పుకోవచ్చు. అమితాబ్ బచ్చన్ గారు ఆ రోజుల్లోనే దేశం మొత్తం మీద ఫ్యాన్స్ ని సంపాదించుకున్న హీరో. హైట్ గురించి మాట్లాడాలంటే అమితాబ్ అనే అందరూ అనే వారు. ఆయన కనపడగానే నేను కాళ్ళ పై పడ్డాను. కానీ ఆయన నువ్వు నా కాళ్ళ పై పడితే నేను నీ కాళ్ళ పై కూడా పడాలి’ అన్నారు.

ఇక కమల్ సార్ సాగర సంగమం చూసి కమల్ హాసన్ గారిలా డ్రెస్ కావాలని మా అమ్మని అడిగాను. అలాగే ఇంద్రుడు చంద్రుడు చూసి కడుపులో క్లాత్ చుట్టుకొని ఆయనలానే యాక్ట్ చేసేవాడిని. అలాంటి లెజెండ్స్ తో యాక్ట్ చేయడం అనేది అన్ బిలివబుల్. ఇక దీపిక ఇంటర్నేషనల్ లెవెల్ కి రీచ్ అయిన స్టార్. దీపికతో నటించడం కూడా నాకు బ్యూటీఫుల్ ఎక్స్పీరియన్స్” అంటూ చెప్పుకొచ్చాడు.
















