టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోలలో ఒకరైన నిఖిల్ (Nikhil) విభిన్నమైన కథలను ఎంచుకుంటూ పాన్ ఇండియా స్థాయిలో సైతం సత్తా చాటుతున్నారు. ఈ ఏడాది స్వయంభూ సినిమాతో నిఖిల్ ప్రేక్షకుల ముందుకు రానుండగా ఈ సినిమా బడ్జెట్ లెక్కలు ఇండస్ట్రీ వర్గాలను సైతం షాక్ కు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా ఉంటున్న నిఖిల్ చీరాల వాసులకు ఏ కష్టం వచ్చినా వెంటనే స్పందిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.
నిఖిల్ మామయ్య కొండయ్య ప్రస్తుతం చీరాల ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన తరపున ఏపీలో నిఖిల్ ప్రచారం చేయగా అందుకు సంబంధించిన ఫోటోలు సైతం నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే చీరాలకు సంబంధించిన ఒక వ్యక్తి చీరాలలోని పువ్వాడ వారి వీధిలో ఆస్పత్రి ముందు చెత్త వేసి ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదని శుభ్రం చేయడం లేదని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
ఆ వ్యక్తి నిఖిల్ ను ట్యాగ్ చేయకపోయినా ఈ సమస్య తన దృష్టికి రావడంతో నిఖిల్ స్పందించి తన మామయ్యతో మాట్లాడి మున్సిపాలిటీ సిబ్బందిని పంపించి క్లీన్ చేయించారు. నిఖిల్ చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుండగా నెటిజన్లు నిఖిల్ ను ఎంతో మెచ్చుకుంటున్నారు. నిఖిల్ అక్కడా హీరోనే ఇక్కడ కూడా హీరోనే అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
నిఖిల్ భవిష్యత్తులో పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తే బాగుంటుందని అభిమానుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిఖిల్ సిద్దార్థ్ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదగాలని మరిన్ని విజయాలను అందుకోవాలని అభిమానులు భావిస్తున్నారు. నిఖిల్ స్వయంభూ (Swayambhu) సినిమా నుంచి త్వరలో క్రేజీ అప్ డేట్స్ రాబోతున్నాయని తెలుస్తోంది. స్పై (Spy) సినిమా నిఖిల్ కు నిరాశ మిగిల్చినా తర్వాత సినిమాలు భారీ విజయాలను అందిస్తాయేమో చూడాలి.