ముగ్గురు హీరోలు, అందులోనూ స్టార్ హీరోలు, ఇంకా చెప్పాలంటే ప్రయోగాలకు ఎప్పుడూ సిద్ధంగా ఉండే స్టార్ హీరోలు కాదన్న కథను, ఆ దర్శకుడిని నమ్మడం అంటే చిన్న విషయమా. కానీ ఈ పని చేసి చూపించారు డార్లింగ్ ప్రభాస్. అవును మేం మాట్లాడుతోంది ‘స్పిరిట్’ సినిమా గురించే, ఆ సినిమా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా గురించే. ఈ సినిమా ప్రభాస్ ఓకే చేయడం వెనుక జరిగిందిదీ అంటూ ఓ చర్చ నడుస్తోంది.
‘స్పిరిట్’ కథను సందీప్ రెడ్డి వంగా… చాలా రోజుల నుండి తిప్పుతూనే ఉన్నారు. తొలుత ఈ సినిమా కథను మహేష్‌బాబు చెప్పారని, ఓకే అవ్వకపోడవంతో రామ్‌చరణ్, అల్లు అర్జున్‌కి కూడా చెప్పారని ఇప్పటికే చదువుకున్నాం. అయితే ఈ కథ విషయంలో వాళ్లు అంత ఆసక్తి చూపించలేదని వార్తలొచ్చాయి. అయితే అసలు ఈ కథేంటి, సినిమా ఎలా ఉండబోతోంది అనేది మనకు తెలియదు. కానీ ప్రభాస్ ఓకే చెప్పాడు. ‘స్పిరిట్’ సినిమా కథను ప్రభాస్ ఓకే చేయడానికి రెండు కారణాలున్నాయని తెలుస్తోంది.
‘స్పిరిట్’ కథ పాన్ ఇండియా స్థాయిదని తెలుస్తోంది. బాలీవుడ్ తన పాగా బలంగా వేయాలని చూస్తున్న ప్రభాస్… ఇలాంటి సబ్జెక్ట్ ఇప్పుడు పడితేనే కరెక్ట్ అనుకున్నారట. దీంతో ఈ సినిమా ఓకే చేశాడట. ఒకప్పుడు ఒకే తరహా సినిమాలే చేస్తున్నాడు అంటూ ప్రభాస్ మీద అపవాదు ఉండేది. దాన్ని చెరిపేసుకునే క్రమంలోనే ఈ డిఫరెంట్ కథ ఎంచుకున్నాడట. అయితే మిగతా వాళ్లకు ఆ పేరు వద్దా అంటే… ఎవరి గేమ్ ప్లాన్ వారిది మరి.