Prabhas: బడ్జెట్ విషయంలో ప్రభాస్ మూవీ రికార్డులు సృష్టించనుందా?

స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల బడ్జెట్ ఏకంగా 3000 కోట్ల రూపాయలు అనే సంగతి తెలిసిందే. ప్రభాస్ సిద్దార్థ్ ఆనంద్ కాంబినేషన్ లో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారతీయ సినీ చరిత్రలోనే రికార్డ్ రేంజ్ బడ్జెట్ లో ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది. 1500 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. బడ్జెట్ విషయంలో ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేయనుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఖర్చు విషయంలో రాజీ పడకుండా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సిద్దార్థ్ ఆనంద్ చెప్పిన కథ మరీ అద్భుతంగా ఉండటంతో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఈ స్థాయి బడ్జెట్ కు ఓకే చెప్పినట్టు సమాచారం అందుతోంది. సిద్దార్థ్ ఆనంద్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాలన్నీ ఒక సినిమాను మించి మరొకటి సక్సెస్ సాధించాయి. పఠాన్ సినిమాతో సిద్దార్థ్ ఆనంద్ మరో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నారు.

సిద్దార్థ్ ఆనంద్ కు ఈ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. సిద్దార్థ్ ఆనంద్ దర్శకునిగా సినిమా సినిమాకు స్థాయిని పెంచుకుంటున్నారు. మైత్రీ నిర్మాతలు సైతం పాన్ ఇండియా ప్రాజెక్ట్ లపై ఫోకస్ పెట్టారని తెలుస్తోంది. ప్రభాస్ సైతం ఈ ప్రాజెక్ట్ కోసం ఆసక్తి చూపిస్తున్నారని బోగట్టా. వచ్చే ఏడాది ఈ సినిమా షూట్ మొదలుకానుందని తెలుస్తోంది.

వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండటంతో ప్రభాస్ ఈ సినిమాకు ప్రస్తుతం డేట్లు కేటాయించలేని పరిస్థితి నెలకొంది. ప్రభాస్ ఈ సినిమాకు 150 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఈ సినిమాకు సిద్దార్థ్ రెమ్యునరేషన్ కూడా 150 కోట్ల రూపాయలు అనే సంగతి తెలిసిందే.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus