Spirit: రెబల్ ఫ్యాన్స్ కు న్యూ ఇయర్ గిఫ్ట్.. అలాంటి లుక్ బయటికి వస్తే..

ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ అనగానే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘యానిమల్’ తర్వాత వంగా తీస్తున్న సినిమా కావడంతో పాన్ ఇండియా మొత్తం దీని వైపే చూస్తోంది. అయితే ఇప్పటిదాకా సైలెంట్ గా ఉన్న టీమ్, కొత్త సంవత్సరానికి అదిరిపోయే ట్రీట్ ఇవ్వడానికి రెడీ అవుతోందని లేటెస్ట్ టాక్.

Spirit

లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంబంధించిన ఒక స్పెషల్ ఫోటోషూట్ ఇటీవల పూర్తయ్యిందట. ఇందులో ప్రభాస్ లుక్ చూసి యూనిట్ సభ్యులే షాక్ అయ్యారని వినిపిస్తోంది. ఈ ఫోటోషూట్ నుంచి ఎంపిక చేసిన ఒక పవర్ ఫుల్ పోస్టర్ ను న్యూ ఇయర్ కానుకగా జనవరి 1న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదే గనక నిజమైతే ఫ్యాన్స్ కు అంతకంటే పెద్ద పండగ ఉండదు.

నిజానికి ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సైలెంట్ గా మొదలయ్యింది. అందులోనూ ప్రభాస్ ఖైదీగా కనిపించే కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారని సమాచారం. జైలు నేపథ్యంలో వచ్చే హై వోల్టేజ్ ఫైట్ సీన్స్ కూడా షూట్ చేశారట. అంటే ఫస్ట్ లుక్ లో ప్రభాస్ ను మనం ఒక ఖైదీగానో లేక పవర్ ఫుల్ పోలీస్ గానో చూసే ఛాన్స్ గట్టిగా ఉంది.

సందీప్ వంగా తన హీరోలను ఎంత వైల్డ్ గా చూపిస్తారో మనకు తెలిసిందే. ఇప్పుడు ఆ వైల్డ్ నెస్ కు ప్రభాస్ కటౌట్ తోడైతే స్క్రీన్ మీద విధ్వంసమే. పోలీస్ డ్రెస్ లో ప్రభాస్ ను చూడాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. ఆ కోరికను తీరుస్తూనే, వంగా తన మార్క్ అగ్రెషన్ ను జోడించి ఈ లుక్ డిజైన్ చేసి ఉంటారు. ఇక 2025 ఆరంభమే ప్రభాస్ నామస్మరణతో మొదలుకాబోతోంది. రాజా సాబ్ హడావిడి ఒకపక్క ఉంటే, స్పిరిట్ అప్డేట్ మరోపక్క సోషల్ మీడియాను షేక్ చేయడం ఖాయం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus