Prabhas: మంచి మనస్సు చాటుకున్న ప్రభాస్.. దాతృత్వంలో బాహుబలి అనేలా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ (Prabhas) కొన్నిరోజుల క్రితం వయనాడ్ బాధితులకు విరాళం అందించడం ద్వారా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ప్రభాస్ ఏకంగా 2 కోట్ల రూపాయల విరాళం ఇవ్వడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అయింది. అయితే ప్రభాస్ కు సంబంధించి మరో విషయం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. ప్రతి సంవత్సరం 100 మంది విద్యార్థులకు ప్రభాస్ ఫీజులు కడుతున్నారని వైరల్ అవుతున్న వార్తల సారాంశం.

Prabhas

అయితే అధికారికంగా ప్రభాస్ సన్నిహితుల నుంచి ఇందుకు సంబంధించి ఒకింత స్పష్టత రావాల్సి ఉంది. వైరల్ అవుతున్న వార్త నిజమైతే మాత్రం ప్రభాస్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని చెప్పవచ్చు. ప్రభాస్ దాతృత్వంలో సైతం బాహుబలి (Baahubali) అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రభాస్ తాను ఎంతోమందికి సహాయం చేస్తున్నా ఆ సహాయాల గురించి మాత్రం చెప్పుకోవడానికి ఇష్టపడటం లేదు. ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండగా కన్నప్ప (Kannappa) , ది రాజాసాబ్ (The Rajasaab)  సినిమాలు కొన్ని నెలల గ్యాప్ లోనే విడుదల కానున్నాయి.

కన్నప్పలో ప్రభాస్ పాత్రకు ఎక్కువగానే ప్రాధాన్యత ఉండనుందని తెలుస్తోంది. మరోవైపు ది రాజాసాబ్ సినిమా నుంచి తాజాగా విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రభాస్ లుక్ మాత్రం అదిరిపోయిందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ ఆ సినిమాలు అంచనాలు మించి సక్సెస్ సాధించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ప్రమోషన్స్ చేయకుండానే స్టార్ హీరో ప్రభాస్ తన సినిమాల కలెక్షన్లతో అదరగొడుతున్నారని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ప్రభాస్ సినిమా సినిమాకు భిన్నమైన జానర్లను ఎంచుకుంటూ ఫ్యాన్స్ ను మెప్పిస్తున్నారు. ప్రభాస్ రియల్ లైఫ్ లో తన చుట్టూ ఉండేవాళ్లకు సైతం ఏ లోటు రాకుండా ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. ప్రభాస్ ఫుడ్ గురించి ఎంతోమంది సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపించారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus