Prabhas: ‘బిగ్ బాస్ 9’ ఫినాలేకి ప్రభాస్.. నిజమెంత?

‘బిగ్ బాస్ సీజన్ 9’ క్లైమాక్స్ కి చేరుకుంది. టాప్ 5 ఎవరో తేలిపోయింది. ఈ ఆదివారంతో విన్నర్ ఎవరనేది కూడా తేలిపోతుంది. ప్రస్తుతం హౌస్ లో తనూజ, కళ్యాణ్ పడాల, ఇమ్మాన్యూల్, సంజన,డీమోన్ పవన్ వంటి వారు ఉన్నారు. వీరిలో విన్నర్ ఎవరు అవుతారు అనే ఆసక్తి అందరిలో ఉంది. ఎక్కువ శాతం తనూజ, కళ్యాణ్ పడాల.. ఈ ఇద్దరిలో ఒకరు విన్నర్ గా నిలిచే అవకాశం ఉందని అంటున్నారు.

Prabhas

చూడాలి మరి.. ఆ ప్రచారంలో ఎంత వరకు నిజం ఉందో..! ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. ప్రతి ఫినాలే ఎపిసోడ్ ని గ్రాండ్ గా నిర్వహిస్తారు బిగ్ బాస్ నిర్వాహకులు. అలాగే ప్రతి ఫినాలేకి ఒక స్టార్ ని గెస్ట్ గా తీసుకురావడం అనేది కూడా ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో ‘బిగ్ బాస్ 9’ ఫినాలేకి ఏ స్టార్ హీరో గెస్ట్ గా వస్తారు? అనే చర్చ మొదలైంది.

నాగార్జున ఎక్కువ శాతం చిరంజీవిని గెస్ట్ గా తీసుకొస్తూ ఉంటారు. కానీ ఈసారి ఆలాంటి పరిస్థితి లేదు. చిరు ‘మనశంకర్ వరప్రసాద్ గారు’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా గడుపుతున్నారు. మరవైపు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘బిగ్ బాస్ సీజన్ 9’కి గెస్ట్ గా హాజరయ్యే అవకాశం ఉంది అంటున్నారు.

‘ది రాజాసాబ్’ సినిమా టీంతో కలిసి ప్రభాస్ ‘బిగ్ బాస్ 9’ ఫినాలేలో పాల్గొనే అవకాశం ఉంది అని టాక్ గట్టిగానే వినిపిస్తోంది. ‘ది రాజాసాబ్’ డిజిటల్ పార్ట్నర్ ‘జియో హాట్ స్టార్’ కాబట్టి ప్రభాస్ ‘బిగ్ బాస్ 9’ వార్తల్లో కొంత నిజం ఉండొచ్చు అని అంచనా..!

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ టీజర్ రివ్యూ.. ఇంట్లో ఇల్లాలు విదేశాల్లో ప్రియురాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus