‘మలుపు’ డైరెక్టర్ తో నాని నెక్స్ట్..?

ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని ప్రధాన పాత్రల్లో నటించిన ‘మలుపు’ చిత్రం మంచి తెలుగులో కూడా మంచి హిట్టయ్యింది. ఈ చిత్ర డైరక్టర్ సత్య ప్రభాస్ పినిశెట్టి టేకింగ్ కు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారని చెప్పాలి. అయితే సత్య ప్రభాస్ కు మన హీరోల నుండీ ఎటువంటి ఆఫర్లు రాలేదు. నాగ్ చైతన్య, అఖిల్ లతో సినిమాలు ఉంటాయని వార్తలొచ్చినా అవి పుకార్లుగానే మిగిలిపోయాయి. అయితే సత్య ప్రభాస్ డైరెక్షన్లో నటించడానికి మన నాచురల్ స్టార్ నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తాజా సమాచారం.

ప్రస్తుతం నాని హీరోగా నటించిన ‘జెర్సీ’ చిత్రం ఏప్రిల్ 19 న (వచ్చే వారంలో) విడుదల కానుంది. మరోపక్క ‘మనం’ ఫేమ్ విక్రమ్ కుమార్ డైరెక్షన్లో కూడా ఓ చిత్రం చేస్తున్నాడు. దీంతో పాటు ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్షన్లో కూడా ఓ సినిమా కమిట్ అయ్యాడు. ఇవి పూర్తయిన తరువాత ‘జెర్సీ’ ప్రొడ్యూసర్స్ అయిన ‘సితార ఎంటర్ టైన్ మెంట్స్’ నాగవంశీ అధినేతతోనే మరో సినిమా చేసే ఆలోచనలో నాని ఉన్నాడట. ఇందుకోసమే సత్య పినిశెట్టి చెప్పిన లైన్ కు నాని ఓకె చెప్పినట్టు స్పష్టమవుతుంది. అందులోనూ సత్య ప్రభాస్ సోదరుడు ఆది పినిశెట్టి కూడా నానికి మంచి స్నేహితుడు కూడా. ఇద్దరూ కలిసి ‘నిన్నుకోరి’ చిత్రంలో నటించారు. ఆది రిఫర్ చేయడం వల్లే నాని… సత్య కు అవకాశం ఇస్తున్నాడని ఫిలింనగర్ విశ్లేషకుల సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus