యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ ఏడాది ‘సాహో’ చిత్రంతో థియేటర్లలో సందడి చేసాడు. ఈ చిత్రానికి బ్యాడ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లు మాత్రం ఓ రేంజ్లో వచ్చాయి. ఈ చిత్రం అన్ని వెర్షన్లు ప్లాప్ అయినప్పటికీ.. హిందీ వెర్షన్ మాత్రం హిట్ గా నిలిచింది. దీంతో హిందీలో తన మార్కెట్ మరింత పెరిగిందనే చెప్పాలి. ప్రస్తుతం రాధా కృష్ణ కుమార్ డైరెక్షన్లో ‘జాన్’ (వర్కింగ్ టైటిల్) చిత్రం చేస్తున్న ప్రభాస్ ఆ తరువాత సందీప్ రెడ్డి వంగా తో సినిమా చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.
ప్రఖ్యాత టి.సిరీస్ వారికి ప్రభాస్ ఓ చిత్రం చేస్తానని అగ్రిమెంట్ పై సైన్ చేసాడు. ఇక మరోపక్క సందీప్ రెడ్డి వంగా కూడా ‘కభీర్ సింగ్’ తర్వాత ఓ సినిమా చేస్తానని టి. సిరీస్ వారి దగ్గర అడ్వాన్స్ తీసుకున్నాడట. అలాగే వీరిద్దరూ ‘మైత్రి మూవీ మేకర్స్’ వారి దగ్గర కూడా అడ్వాన్స్ తీసుకున్నారట. కాబట్టి ‘టి. సిరీస్’ వారు ‘మైత్రి’ వారితో కలిసి ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా చిత్రాన్ని నిర్మించే అవకాశాలు బలంగా ఉన్నాయని ఫిలింనగర్లో డిస్కషన్లు జరుగుతున్నాయి.