సాహో తర్వాతి సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభాస్!
- July 26, 2017 / 05:43 AM ISTByFilmy Focus
బాహుబలి 2 తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ డైరెక్షన్లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. యువీ క్రియేషన్స్ బ్యానర్లో భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ మొదలయింది. ప్రభాస్ లేకుండా కొన్ని సీన్స్ తెరకెక్కించారు. సిటీ సెంట్రల్ లైబ్రరీలో బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ పై కొన్ని షాట్స్ చిత్రీకరించారు. ముంబై లో మొదలు కానున్న లేటెస్ట్ షెడ్యూల్ లో ప్రభాస్ జాయిన్ కానున్నారు. యాక్షన్ సీన్స్ కోసం ప్రాక్టీస్ లో నిమగ్నమైన ఉన్న ప్రభాస్ సాహో తర్వాతి సినిమాకి కూడా ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
గోపి కృష్ణ ఫిలిమ్స్ బ్యానర్లో కృష్ణం రాజు నిర్మించనున్న ఆ సినిమాని జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహించనున్నారు. ఇది యూరప్ బ్యాక్ డ్రాప్‌లో సాగే పీరియాడిక్ లవ్ స్టోరీ అని తెలిసింది. ‘సాహో’ తరువాత ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. సాహో తో పాటు నెక్స్ట్ సినిమా కూడా ఏకకాలంలో మూడు భాషల్లో నిర్మితం కానుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.













