Pragya Jaiswal,Salman Khan: సల్మాన్‌తో పరిచయం గురించి ప్రగ్య కామెంట్స్‌!

  • January 25, 2022 / 12:22 PM IST

బాలీవుడ్‌ భాయ్‌జాన్‌ సల్మన్‌ ఖాన్‌ సినిమాలో ప్రగ్య జైశ్వాల్‌ ఛాన్స్‌ కొట్టేసింది అంటూ ఆ మధ్య వార్తలొచ్చాయి. ముందు హీరోయిన్‌ అన్నారు, ఆ తర్వాత సినిమాలో ఓ పాట అన్నారు. ఆ తర్వాత తూచ్‌ అదేమీ లేదన్నారు. అయితే ఇద్దరూ కలసి ఓ పాటకు స్టెప్పులేశారు. కానీ సినిమా పాటకు కాదు. ప్రైవేట్‌ ఆల్బమ్‌. టీసిరీస్‌ కలసి సల్మాన్‌ నిర్మించిన ఈ ఆల్బ్‌మ్‌లో ప్రగ్య ఆడిపాడింది. సల్మాన్‌ క్లాసీ లుక్స్‌కి, ప్రగ్యా ఫ్యామిలీ లుక్స్‌ అదిరిపోయాయి. పాటలో ఇద్దరి మధ్య రొమాన్స్‌ అయితే అదిరిపోయిందనే చెప్పాలి. ఈ పాట గురించి ప్రగ్య మాట్లాడింది.

‘మే చలా..’ అంటూ సాగే వీడియో గీతాన్ని సల్మాన్‌ ఖాన్‌ స్నేహితురాలు యులియా వంతూర్‌, ప్రముఖ గాయకుడు గురు రంధ్వా కలసి ఆలపించారు. సల్మాన్‌ ఫామ్‌ హౌస్‌ ఆ పరిసర ప్రాంతాల్లోనే ఈ పాట చిత్రీకరణ సాగింది. ఇందులో ప్రగ్య చీరకట్టులో అదిరిపోయింది. సల్మాన్‌ను ఆట పట్టించే సీన్స్‌, కొన్ని రొమాంటిక్‌ సీన్స్‌ అయితే అదిరిపోయాయి. పగడా లుక్‌తో కనిపించిన సల్మాన్‌ ఎంతగా ఆకట్టుకున్నాడో, జుట్టును ఓపెన్‌ ఎయిర్‌గా వదిలేసి నడుచుకొని వచ్చే సీన్‌లో ఇంకా అదిరిపోయాడు అని చెప్పాలి.

ప్రగ్యకి అయితే మొత్తం సాంగ్‌లో చీరతోనే కనిపిస్తుంది. పలుచటి ఒకే రంగు చీరలో హోమ్లీ లుక్‌లో చూపించారు ఆమెను. ఫ్రేమ్‌ నిండా భలే ఉంది అనిపిస్తుంది. ఆమె వీపును సల్మాన్‌ భుజంతో నిమిరే సీన్‌ అయితే హైలైట్‌ అని చెప్పొచ్చు. ఇటీవల విడుదలైన ఈ గీతానికి మంచి స్పందన లభిస్తోంది. యూట్యూబ్‌లో 20 లక్షల వ్యూస్‌ను దాటుకొని 30 లక్షలవైపు దూసుకెళ్లిపోతోంది. మరి సల్మాన్‌తో కలసి నటించడం ఎలా ఉంది అని ప్రగ్యను అడిగితే… ఇలా చెప్పుకొచ్చింది.

సల్మాన్‌ ఖాన్‌ను సెట్లోనే తొలిసారి కలిశాను. నాకు అంతకుముందు వరకు అక్కడ విషయాలేవీ తెలియవు. ఆయనను తొలిసారి కలుస్తున్నా కదా కొంచెం ఆచితూచి వ్యవహరిస్తే మంచిది అనిపించింది అని చెప్పింది ప్రగ్య. సల్మాన్‌ పక్కన నటిస్తున్నాను కదా అని చనువుగా వ్యవహరించకూడదు అనుకుందట. దాని వల్ల లేనిపోని సమస్యలు వస్తాయేమో అనుకుందట. తొలి రోజు షూటింగులో ‘నేను మిమ్మల్ని టచ్‌ చేయొచ్చా?’’ ని అడిగిందట. దానికి సల్మాన్‌ ‘అందులో ఏముంది.. నన్ను టచ్‌ చేయొచ్చు’ అన్నాడట. అనుమతి లేకుండా చనువు తీసుకుంటే ‘ఓవర్‌ చేస్తుంది’ అనుకుంటారు కదా… అందుకే అడిగేశా అని చెప్పింది ప్రగ్య.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!


చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus