Pragya Jaiswal: టాలీవుడ్‌కి మరో వరలక్ష్మి శరత్‌కుమార్‌ దొరికేసిందా? ఎవరంటే?

  • January 9, 2024 / 12:13 PM IST

టాలీవుడ్‌లో ప్రజెంట్‌ లేడీ విలన్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేర్లు రెండే. మొన్నీమధ్య వరకు ఒకటే ఉండే, ‘సలార్‌’ వచ్చాక ఇద్దరయ్యారు. ఇప్పుడు మూడో భామ రాబోతోందా? ఏమో ఇప్పుడు ఆమె ఓకే చేసిన సినిమాకు సరైన స్పందన వస్తే కచ్చితంగా మూడో బ్యాడీ రెడీ అవుతుంది అని చెప్పొచ్చే. తొలి ఇద్దరు వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, శ్రియా రెడ్డి అయితే… ఇప్పుడు మూడో బ్యాడీగా రాబోతున్న భామ ప్రగ్యా జైస్వాల్‌.

‘అఖండ’ సినిమాలో నందమూరి బాలకృష్ణకు జోడీగా కనిపించి మెప్పించింది ప్రగ్యా జైస్వాల్‌. అప్పటికే కొన్ని సినిమాలు చేసినా… ఈ సినిమా మంచి విజయం అందుకున్నా ప్రగ్యాకు సరైన అవకాశాలు రావడం లేదు. ఏవేవో సినిమాలు చేసినా ఫలితం అనుకూలంగా రాలేదు. గత కొంతకాలంగా ఛాన్స్‌ల కోసం చూస్తున్న ప్రగ్యాకు ఇప్పుడు సరికొత్త పాత్ర ఆఫర్‌ చేశారట సాగర్‌ కె. చంద్ర. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా సాగర్‌ కె.చంద్ర ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

‘టైసన్‌ నాయుడు’ అంటూ ఇటీవల ఆ సినిమాకు పేరు కూడా పెట్టారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా టీమ్‌ నుండి వస్తున్న సమాచారం ప్రకారం సినిమాలో ఓ కీలక పాత్ర కోసం ప్రగ్యా జైస్వాల్‌ను ఎంపిక చేశారని సమాచారం. ఆ పాత్రలో ప్రతినాయిక ఛాయలు ఉంటాయి అంటున్నారు. వినూత్నమైన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ పోలీసు అధికారిగా కనిపించనున్నాడు.

మరోవైపు (Pragya Jaiswal) ప్రగ్యా జైస్వాల్‌, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ గతంలో ఓ హిట్‌ సినిమా చేశారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘జయ జానకి నాయక’ సినిమాలో ఇద్దరూ కలసి నటించారు. ఇప్పుడు మళ్లీ ఇన్నేళ్లకు ఇద్దరూ కలసి నటించబోతున్నాడు. పుకార్లు నిజమై ‘టైసన్‌ నాయుడు’ విజయవంతమై ఆమె పాత్రకు పేరొస్తే టాలీవుడ్‌లో మరో లేడీ బ్యాడీ దొరికినట్లే. ఇటీవల వచ్చిన ఈ సినిమా టైటిల్‌ గ్లింప్స్‌కు మంచి స్పందనే వచ్చింది.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus