నటుడు ప్రసాద్ బెహరా (Prasad Behara) Laiగిక ఆరోపణల కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. 14 రోజుల పాటు అతను జైల్లోనే గడిపి రావాలి. జూబ్లీ హిల్స్ లోని సైలెంట్ వాలీ హిల్స్ వద్ద జరిగిన ‘మెకానిక్’ అనే సిరీస్ షూటింగ్లో భాగంగా కంచన్ బామ్నె అనే సహనటిని క్రూ అందరి ముందు అవమానించాడని.. ఆమె బ్యాక్ (పిరుదుల భాగం) పై కొట్టాడని.. అంతేకాకుండా ఆమెను అనకూడని మాటలు అన్నాడని… బూతులు కూడా తిట్టాడని ఆమె కంప్లైంట్లో రాసుకొచ్చినట్టు జూబ్లీ హిల్స్ పోలీసులు తెలిపారు.
అయితే ఈ సంఘటన జరిగి 4 రోజులు అయినట్లు ఇన్సైడ్ టాక్. ఈ విషయమై ప్రసాద్ బెహరా తన స్నేహితుల వద్ద ప్రస్తావించాడట. అతని మాటల ప్రకారం.. ప్రసాద్ బెహరాకి ఆమె ముందు నుండి ఫ్రెండ్ అట. అయితే కంచన్ బామ్నెకి కొంచెం నత్తి సమస్య ఉందట. అందువల్ల ఆమె డైలాగులు సరిగ్గా పలకలేదు అని తెలుస్తుంది. అందుకే ‘మెకానిక్’ అనే సిరీస్లో ఆమె పాత్రని ప్రసాద్ బెహరా తగ్గించాడట.
అయినప్పటికీ ఆమె షూటింగ్ టైంలో డైలుగులు సరిగ్గా పలకలేక ఇబ్బంది పడిందట. ఈ క్రమంలో ప్రసాద్ బెహరా అందరి ముందు ఆమెపై మండి పడ్డాడట. షాట్ ముగిసిన అనంతరం ఆమెను కూల్ చేయడానికి ప్రసాద్ బెహరా తన స్టైల్లో కామెడీ చేశాడట. అందులో భాగంగానే(ఆమెతో ఉన్న చనువు కారణంగా) కంచన్ ని టచ్ చేస్తే.. ఆమె ఫ్రస్ట్రేషన్లో ప్రసాద్ పై మండిపడిందట.
ఆ తర్వాత కూడా ఆమె వెనుక ప్రసాద్ బెహరా కన్విన్స్ చేయడానికి వెళ్తే.. ఆమె తప్పుగా అర్థం చేసుకున్నట్టు ప్రసాద్ బెహరా తన స్నేహితుల వద్ద చెప్పాడట. షూటింగ్ అయ్యే వరకు ఆగి.. తర్వాత ఆమె పోలీసులను ఆశ్రయించడం జరిగిందని తెలుస్తోంది. ఇది పూర్తిగా ప్రసాద్ బెహరా వెర్షన్. మరి నిజానిజాలు ఏంటి? వీరి గొడవ తెలిసిన వారు ఎవరికి మద్దతుగా నిలబడతారు’ అనే దాన్నిబట్టి కేసు ఓ కొలిక్కి వస్తుంది.