“బ్రహ్మోత్సవం” డిజాస్టర్ గా నిలవడం వల్ల ఆగ్రా నిర్మాత పివిపి ఇక సినిమాల నుంచి తప్పుకొంటున్నాడు అంటూ గత రెండ్రోజులుగా కొన్ని వెబ్ సైట్లలో కథనాలు వెల్లువెత్తాయి.
అయితే.. సదరు కథనాల్లో ఏమాత్రం నిజం లేదని పివిపి బృందం స్పష్టం చేసింది. భారీ నష్టాలు వాటిల్లిన విషయం వాస్తవమే కానీ.. ఆమాత్రానికే ఆయన నిర్మాణానికి స్వస్తి పలికే టైపు కాదు అంటూ వారు తెలిపారు.
ఇకపోతే.. సదరు కథనాలను గురించి తన మిత్ర బృందం చెప్పడంతో చదివిన పివిపి “అసలు ఇలాంటి స్టోరీస్ ఎలా రాస్తారు?” అంటూ నవ్వుకొన్నాడట. అదండీ సంగతి.. పివిపి సినిమాలు తీయడం ఆపట్లేదు. మనం కూడా సినిమాలు చూడడం మానోద్దు!